Last Updated:
Chicken Price: నాన్వెజ్ ఆహారం ఇష్టపడే వారికి ప్రస్తుతం చికెన్ ధరలు పెరగడం పెద్ద షాక్కు గురి చేస్తోంది. ఇటీవల మార్కెట్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి కిలో ధర మళ్లీ పెరగడంతో వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Chicken Price: నాన్వెజ్ ఆహారం ఇష్టపడే వారికి ప్రస్తుతం చికెన్ ధరలు పెరగడం పెద్ద షాక్కు గురి చేస్తోంది. ఇటీవల మార్కెట్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి కిలో ధర మళ్లీ రూ.300 వరకు చేరుకోవడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆదివారం రోజుల్లో సాధారణంగా నాన్వెజ్ వంటకాల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది చికెన్ కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. ఫలితంగా చాలా ప్రాంతాల్లో చికెన్ షాపులు కస్టమర్లతో రద్దీగా కనిపిస్తాయి.
ప్రముఖ వెబ్ సైట్ ఫౌల్ట్రీ బజార్.కామ్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.250 నుంచి రూ.260 మధ్య ఉండగా, ఇప్పుడు పలు ప్రాంతాల్లో రూ.300 వరకు చేరుకుంది. మార్చి 9వ తేదీన చికెన్ ధరలు కేజీ రూ.291గా ఉండటం గమనార్హం. డిమాండ్ పెరగడమే చికెన్ రేట్లు పెరగడానికి దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
హైదరాబాద్లో ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ ధర కిలోకు రూ.290 నుంచి రూ.300 మధ్య ఉంది. డ్రస్డ్ చికెన్ ధర సుమారు రూ.260గా ఉండగా, రిటైల్ లైవ్ బర్డ్ ధర రూ.177గా ఉంది. ఫామ్ స్థాయిలో లైవ్ బర్డ్ ధర రూ.150 వరకు కొనసాగుతోంది. వరంగల్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.290కి విక్రయిస్తుండగా, ఆసిఫాబాద్లో రూ.300 వరకు ఉంది. అలాగే కామారెడ్డిలో రూ.280 నుంచి రూ.300 మధ్య ధరలు కనిపిస్తున్నాయి. మరోవైపు విజయవాడలో కూడా చికెన్ ధర కిలోకు రూ.300కు చేరుకుంది.
చికెన్ ధరలు పెరిగినప్పటికీ గుడ్ల ధరలు మాత్రం తగ్గడం గమనార్హం. ప్రస్తుతం 30 గుడ్ల ట్రే ధర రూ.130 నుంచి రూ.140 మధ్య ఉంది. రిటైల్ మార్కెట్లో 12 గుడ్ల ప్యాక్ సుమారు రూ.60కు లభిస్తోంది. ప్రపంచ పరిస్థితుల ప్రభావంతో గుడ్ల ఎగుమతులు తగ్గిపోవడం ధరలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విదేశాలకు గుడ్ల ఎగుమతులు తగ్గడంతో దేశీయ మార్కెట్లో నిల్వలు పెరిగాయి. దీంతో గుడ్ల ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల పక్షి వ్యాధులు మరియు వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గింది. ఉత్పత్తి తగ్గిపోవడం, డిమాండ్ అధికంగా ఉండటం వల్ల చికెన్ ధరలు పెరిగాయని పౌల్ట్రీ రంగం తెలిపింది. ఫామ్లలో ఉత్పత్తి మళ్లీ పెరిగితే ధరలు తగ్గే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Hyderabad,Telangana



