Last Updated:
Chicken Price Hike:యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు, దీంతో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు.
Chicken Price Hike: యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు, దీంతో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు 200 నుంచి 250 వరకు ఉండే చికెన్ ధర గతవారం రోజులుగా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతుంది. ప్రస్తుతం హోల్‌సేల్ ధర రూ.350 నుంచి రూ.400 ఉండగా రిటైల్ చికెన్ ధర కిలో రూ. 400 నుంచి ఆపై అమ్మకాలు నిర్వహిస్తున్నారు. దీంతో చికెన్ జోలికి పోలేమంటూ నాన్‌వెజ్‌కి దూరమవుతున్నారు. మరొక హోటల్స్‌లో బిర్యాని, చికెన్ జాయింట్స్, చికెన్ పకోడీ వంటివి డబల్ రేట్లు అమ్మకాలు అమ్మితే తప్ప బ్రతకలేమంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి నెలకొంది.
గ్యాస్ కొరత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల హోటల్స్ మూసివేస్తుంటే మరికొందరు వ్యాపారులు కమర్షియల్ సిలిండర్లను బ్లాక్ లో కొనుగోలు చేసి హోటల్స్ రన్ చేస్తున్నారు. అయితే బ్లాక్‌లో గ్యాస్ కొనుగోలు చేయడం వల్ల పడిన భారాన్ని కస్టమర్లపైనే రుద్దుతున్నారు. టిఫిన్, మీల్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నింటిపై ఎక్స్‌ట్రా చార్జ్ పేరుతో దర్జాగా అమ్ముతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆహార పదార్ధాల ధరలు ఇలా ఉంటే చికెన్ ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. ఆల్కహాల్ సేవించే వారి దగ్గర నుండి ఇంట్లో పిల్లల వరకు స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్‌గా స్టాటర్స్ గా చికెన్ ఐటమ్స్ తినడం కామన్ అయిపోయింది. కాని ఇప్పుడు మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.400 కు చేరుకోవడంతో చికెన్ పకోడీ మినిమమ్ 100 రూపాయలు పెడితే 50 గ్రాములు కూడా రాని పరిస్థితి దాపురించింది. ఇక హంగుగా ఆర్భాటంగా తినాలి అంటే 500 నుంచి 1000 వరకు స్నాక్స్ కి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. ఇవన్నీ కాదు సాధారణ వ్యక్తి చికెన్ కొని ఇంట్లో తినాలి అంటే చేత్తో 500 ఒక్క చికెన్కే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో చికెన్ జోలికి ప్రజలు పోవడానికి భయపడుతున్నారు.
చికెన్ రేట్లు పెరిగిన నేపథ్యంలో కొన్నిచోట్ల కల్తీ చికెన్ అమ్మకాలు నిర్వహిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. నిజానికి చికెన్ అమ్మేటప్పుడు మన ముందు కోడికొస్తే ఓకే లేకుండా ముందే కోసి ఐదు నుంచి పది కోళ్లు ఒక టబ్ లో పెడితే మాత్రం దానిని కట్ చేసేటప్పుడు రక్తం వస్తుందా లేదా అన్నది కచ్చితంగా చూసుకోవాలి. రాకపోతే ఆ కోడి ఏదో తేడా అని గ్రహించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. సందిట్లో సడేమీయల ఇలాంటి సమయంలో చనిపోయిన కోళ్లు సైతం అమ్మేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చికెన్ ఫార్మ్స్ నుంచి కోళ్లు తేవాలంటే అధిక రేట్లు ఉన్న నేపథ్యంలో కొందరు చనిపోయిన కోళ్లు తక్కువ రేట్లకు ఇవ్వడం మరల ఆ కోళ్లు అమ్మకాలు వంటివి జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది? ఏది ఏమైనా ఈ విషయంపై ప్రజల కాస్త జాగ్రత్తగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.
యుద్ధ ప్రభావం ఏమోగానీ ముందుగా గ్యాస్ సమస్య ఆ తర్వాత ఎగుమతి కొరత నేపథ్యంలో గుడ్లు ఒక్కసారిగా కుదేళ్లు అయిపోయిన పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క కోడిగుడ్డు మార్కెట్లో నాలుగు రూపాయలకు ఇస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి, ఒకవైపు చికెన్ ఆకాశానికి మరోవైపు గుడ్డు నేలమీదకి అన్న పరిస్థితి ఏపీలో దాపురించిందని చెప్పుకోవచ్చు.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh


