అన్ని మతాలను గౌరవిస్తా… అందరివాడిలా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చామని, ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విందులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు నజీర్, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు.



