Last Updated:
తూర్పుగోదావరి వెలుగుతోడు గ్రామానికి చెందిన దంపతులు భోగిలి వీరవెంకట సతీష్, కిరణ్మయి తాపేశ్వరం దగ్గర కారు కాలువలో పడిపోవడంతో మృతి, పిల్లలు సహా ఇతరులు సురక్షితం.
ఏపీకి సంబంధించి ఆ జిల్లాలో అనుకోని ప్రమాదం భార్యాభర్తల ఇద్దరు ప్రాణాన్ని తీసుకుపోయింది, నిజానికి అదే వాహనంలో వారి పిల్లలు తల్లి ఉన్నప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు మాత్రం మృత్యువాత పడ్డారు, అప్పటివరకు ఒక ఫంక్షన్ కి వెళ్లిన ఈ ఫ్యామిలీ ఎంతో సరదా సరదాగా గడిపింది. తిరుగు ప్రయాణంలో ఊహించని పరిణామం కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు బ్రతికే ఉన్నారని ఎదురుచూసిన, ఆ కుటుంబానికి నిరాశే మిగిలింది. ఇంతకీ అలాంటి ఘటన ఎక్కడ చోటుచేసుకుంది? అసలు ఏం జరిగింది ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
తూర్పుగోదావరిజిల్లా వెలుగు తోడు గ్రామానికి చెందిన భోగిలి వీరవెంకట సతీష్, అతని భార్య భోగిలి కిరణ్మయి, తల్లి, తండ్రి పిల్లలతో కలిసి కాకినాడ బంధువుల వివాహం నిమిత్తం ప్రయాణమయ్యారు. కుటుంబ సభ్యులు అంతా సరదా సరదాగా వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరిగి వారి స్వగ్రామం చేరుకునే క్రమంలో దాదాపు ఆరుగురుతో ప్రయాణిస్తున్న కారు సరిగ్గా తాపేశ్వరం శివారు పేకేటిపాలెం సమీపాన అనుకోకుండా పంట కాలువలోకి దూసుకుపోయింది. దీంతో కారు దాదాపుగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది, ఈ ప్రమాదం చూసిన స్థానికులు కారులో ఉన్న వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే అప్పటికే దంపతులు వీరవెంకట సతీష్, కిరణ్మై ఇద్దరు ప్రాణాలు విడిచినట్లుగా స్థానికులు తెలిపారు. కారులో ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా ఈ ఘటనతో ఇటు కాకినాడ అటు వెలుగుతోడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కారు నడిపేటప్పుడు భర్త డ్రైవింగ్ చేయగా భార్య ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉన్న నేపథ్యంలో నీటిలో ముందుగా కారు ఎదురు భాగం మునిగిపోవడంతో ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తుంది. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఘటనపై మండపేట రూరల్ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..
ఏది ఏమైనా అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని చెప్పుకోవచ్చు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మనలో మరో రకమైన ఆలోచన వచ్చిన ఏం జరుగుతుందో చెప్పలేము కాబట్టి జాగ్రత్త వహించాలంటూ పలువురు పేర్కొంటున్నారు.
చివరికి మృతదేహాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది, దీంతో అప్పటివరకు సరదా సరదాగా గడిచిన భార్యాభర్తలు ఇక లేరు అన్న విషయంతో చిన్నారులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు సైతం మండపేట ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Apr 06, 2026 10:10 PM IST



