Last Updated:
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో తిరుపతిలో బ్యూటీషియన్ శిక్షణ, ఏప్రిల్ 14 నుంచి మే 12 వరకు, ఫీజు 2500, 16 ఏళ్లు పైబడిన మహిళలు పురుషులకు అవకాశం
ప్రస్తుత కాలంలో అందంగా కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే బ్యూటీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతూ, అనేకమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే మహిళల ఆర్థిక సాధికారతకు, స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తూ ‘సాక్షి మైత్రి మహిళ’ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో వృత్తిపరమైన శిక్షణను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈ శిక్షణలో పాల్గొనడానికి వయస్సుతో సంబంధం లేకుండా, 16 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలతో పాటు ఆసక్తి గల పురుషులు ఈ కోర్సులో చేరవచ్చు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమై, మే 12వ తేదీ వరకు సుమారు ఒక నెల రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు (కేవలం 3 గంటలు మాత్రమే). ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో తరగతులు నిర్వహించబడతాయి.
అభ్యర్థులకు బ్యూటీషియన్ రంగంలో నిపుణులుగా మార్చేందుకు అవసరమైన అన్ని మౌలిక అధునాతన అంశాలను ఇక్కడ నేర్పిస్తారు. వాటిలో వివిధ రకాల ఫేషియల్స్, బ్లీచింగ్, స్కిన్ కేర్ టిప్స్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, వ్యాక్సింగ్. హెయిర్ కటింగ్ (వివిధ స్టైల్స్), హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, హెయిర్ మసాజ్, హెయిర్ ట్రీట్మెంట్స్. బ్రైడెల్ మేకప్, పార్టీ మేకప్, లైట్ మేకప్.
ఐబ్రోస్ థ్రెడింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, శారీ డ్రాపింగ్ వంటి అంశాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ గ్రూమింగ్‌పై అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణ కేవలం నేర్చుకోవడానికే పరిమితం కాదు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈ శిక్షణ కేంద్రం వారే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. తద్వారా కోర్సు పూర్తి కాగానే నేరుగా ఆర్థికంగా స్థిరపడే అవకాశం లభిస్తుంది.
రిజిస్ట్రేషన్ వివరాలు: ఆసక్తి గల వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు (ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల లోపు) దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము రూ. 2500 గా నిర్ణయించారు.
శిక్షణ స్థలం: కెనరా బ్యాంక్ పైన, అర్చ్ రోడ్డు, బైరాగి పట్టాడ, తిరుపతి. మరింత సమాచారం లేదా సందేహాల కోసం ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు: 9553454335, 9666697211.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



