APSRTC: సింహాచలం చందనోత్సవానికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. భక్తుల కోసం 380 ప్రత్యేక బస్సులు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఏప్రిల్ 20న విశాఖపట్నం సింహాచలం చందనోత్సవానికి లక్షలాది భక్తుల రద్దీ, భక్తుల సౌకర్యానికి 380 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం, మెకానికల్ టీమ్స్ అప్రమత్తం

+

సింహాచలం

సింహాచలం చందనోత్సవానికి 300 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం 

విశాఖపట్నంలో సింహాచలంలో జరిగే చందనోత్సవం కార్యక్రమం ఏప్రిల్ 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగుతుంది. విశాఖపట్నం ప్రాంతానికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ చందనోత్సవ కార్యక్రమానికి సింహాచలం భక్తులు వస్తారు. రాత్రంతా క్యూలైన్లో వేచి ఉండి మరి స్వామివారిని దర్శించుకుని వెళ్తారు. తెల్లవారుజాము నుంచి నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది.

ఈ చందనోత్సవం రోజు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ సమిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు సింహాచలం విచ్చేస్తారు. భక్తుల రద్దీ దృశ్య 380 ప్రత్యేక ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరూ వినియోగించుకోవాలని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు తెలిపారు. చందనోత్సవం రోజు సింహాచలం కొండ కింద నుంచి పైకి వెళ్లేందుకు కొండ దిగువ 80 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

తగరపువలస , భీమిలి , గాజువాక , పెందుర్తి , ఆనందపురం , అనకాపల్లి , విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చే భక్తులకు సింహాచలం కొండ వరకు 300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని ఎవరు కూడా బస్సులు లేవని కంగారు పడొద్దు అని తెలిపారు.

కొండ మీదకి కొండ కింద వరకు భక్తులను సురక్షితంగా చేరవేసేందుకు బస్సులన్నీ సిద్ధం చేయాలని ఆర్టీసీ సిబ్బందికి విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తెలిపారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు బస్సులను తనిఖీ చేసి వారి యొక్క రిపేర్లు చేసి సిద్ధమ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సింహాచలం డిపోలో మెకానికల్ సిబ్బంది డ్రైవర్లు కండక్టర్లు తగు విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

కొండపైకి ఎక్కి బస్సులను స్పెషల్ మెకానికల్ టీమ్స్ ద్వారా తనిఖీలు జరిపి ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు సరి చేయాలని డిపో సిబ్బందికి సూపర్వైజర్లకు అధికారులకు సూచనలు చేయడం జరిగినది. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను, కలెక్టర్ గారిని ఇచ్చే ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని 20వ తారీకు తెల్లవారుజాము నుంచి బస్సులను ఎప్పటికప్పుడు, తిప్పుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలను అందించాలని, మెకానికల్ రిలీఫ్ టీమ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *