Last Updated:
సమ్మర్ లో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. రాజమండ్రి, దేవీపట్నం నుంచి బోటు ప్రయాణం, ఫుడ్ ప్యాకేజీ, లైఫ్ జాకెట్ తప్పనిసరి, అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్నా చల్లని నీటిలో హాయ్ హాయిగా ఎంజాయ్ చేస్తూ పర్యటకులు బోర్డులో సందడి చేస్తున్నారు. ఇప్పటివరకు వీకెండ్ సెలవు రోజుల్లో మాత్రమే అత్యధికంగా కనిపించే పర్యాటకులు ప్రతిరోజు విహారయాత్ర ప్రాంతంలో సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో వారికి తగ్గట్టుగా పర్యాటక ఏర్పాటులు సైతం నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.
బ్రేక్ ఫాస్ట్, ఫుడ్, స్నాక్స్, టీతో కలిపి ప్యాకేజీ సైతం ఏర్పాటు చేశారు, నాన్ వెజ్ వంటకాలు సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఒకసారి పాపికొండలు విహారయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? వాటి వివరాలు ఏంటి ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలలో పాపికొండల విహారయాత్ర పర్యాటకం ఒక ఎత్తు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందమైన గోదావరిపై పాపికొండలు మధ్య నుంచి బోటు పై వెళుతూ మధ్యమధ్యలో డాన్సులు చేస్తూ, నచ్చిన ఫుడ్ తింటూ, అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గా, దాదాపు 8 గంటలకు పైగా కాలం బోటులో గడిపేదే పాపికొండల విహారయాత్ర అని చెప్పుకోవచ్చు.
అయితే ఒకప్పుడు వీకెండ్ అంటే విపరీతమైన పర్యాటకులు ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు వీకెండ్తో పాటు అన్ని రోజులు పర్యాటకులతో పాపికొండలు విహారయాత్ర కళకళలాడుతూ కనిపిస్తుంది. రాజమండ్రి పాయింట్ నుంచి కొందరు, దేవీపట్నం పాయింట్ నుంచి మరికొందరు ప్రయాణమవుతున్నారు. ఎండాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పర్యాటకుల సంఖ్య సైతం పెరుగుతూ వస్తుంది.
ఈనెల రోజులు గడిస్తే ఈ పర్యాటకుల సంఖ్య అంతకంత పెరిగే అవకాశం ఉందని పర్యాటక శాఖ అంచనా వేస్తుంది. రాజమండ్రి నుంచి బోటు ప్రారంభమై పాపికొండలు అనంతరం వచ్చు నూకాలమ్మతల్లి గుడి వద్దకు వెళ్లి మరల వెనక్కి వచ్చేందుకు ఫుడ్, స్నాక్స్, టీ, టిఫిన్‌తో కలిపి రూ.1200 చార్జ్, దేవీపట్నం నుంచి ప్రారంభమైతే ఇదేజర్నీ ఇదే ఫుడ్ తో వెయ్యి రూపాయలు చార్జ్ వేస్తున్నారు.
అయితే ఈ బోటింగ్ కి వెళ్లే పర్యాటకులు ఉదయం 8 గంటలు సమయానికే రాజమండ్రి లేదా దేవీపట్నం ప్రాంతానికి చేరుకోవాలని నిర్వాహకులు తెలియజేస్తున్నారు, ముఖ్యంగా దేవిపట్నం వచ్చే రహదారిలో ప్రమాదకర మలుపులు ఉన్న నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తలు వహించాలని అధికారులు పేర్కొంటున్నారు, అంతకుమించి పర్యాటకులు వస్తున్న వెహికల్ సైతం జాగ్రత్తగా పార్క్ చేసుకోవాలంటూ పిలుపునిస్తున్నారు.
బోటు ఎక్కి ప్రతి పర్యాటకుడికి లైఫ్ జాకెట్ కంపల్సరీ ఇస్తున్నామని, అయితే కచ్చితంగా ప్రయాణం ముగిసే వరకు ఆ లైఫ్ జాకెట్టు ఉంచుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు, అదేవిధంగా బోటు ఎక్కిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు అన్ని ఎప్పటికప్పుడు వివరిస్తున్నామని, అదేవిధంగా పాపికొండలు టూర్‌కు సంబంధించి ఏప్రాంతం ఎంత అద్భుతంగా ఉంటుందో వివరించి ఒక అందమైన అద్భుతమైన పర్యాటకంగా పాపికొండలు పర్యటన కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


