AP Unified Family Survey: ఏపీ కుటుంబ సర్వేలో కీలక అప్‌డేట్.. వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు


మార్పులు, కండీషన్లు:

– ఇదివరకు సబ్మిట్ చేసిన సర్వేలో వ్యక్తిగత, కుటుంబ వివరాలను ఎడిట్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.

– ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రమే ఎడిట్ అవకాశం ఉంటుంది.

– ఎడిట్ చేసిన వివరాలు 24 గంటల తర్వాత డేటాలో అప్‌డేట్ అయ్యి కనిపిస్తాయి.

– మరణాలు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి గురించి పొరపాటుగా వివరాలు ఇచ్చిన వారు.. తిరిగి ఆ వివరాలను ఇప్పుడు సరిచేసుకునే సౌలభ్యం ఉంది.

– తప్పుగా నమోదైన వివరాలను సరిచేసుకోవడానికి ఇదే చివరకి అవకాశం.

– స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల సిబ్బంది.. పెండింగ్ సర్వేలను అతి జాగ్రత్తగా పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.

కుటుంబాలు ఎలా ఎడిట్ చేసుకోవాలి?:

కుటుంబ సర్వేలో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నంబర్లు, మొబైల్ నంబర్లు, చదువు, ఉద్యోగాల వివరాలు, వాహనాలు, ఆస్తులు, ఇంటి వివరాల వంటివి నమోదు చేశారు. సర్వేలో ఏ అంశంపై మార్పులు చెయ్యాలనుకున్నా.. కుటుంబ సభ్యులు స్వయంగా UFS యాప్‌లో ఎడిట్ ఆప్షన్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు. ఇది ఒకసారి మాత్రమే కాబట్టి.. మార్పుల తర్వాత.. అన్నీ క్రాస్ చెక్ చేసుకొని.. ఫైనల్ సబ్‌మిట్ క్లిక్ చెయ్యాలి.

UFS యాప్ ఎక్కడ లభిస్తుంది?

ఈ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లో https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey&hl=en_IN ద్వారా పొందవచ్చు. లేదా సెర్చ్‌లో UFS App అని సెర్చ్ చేస్తే.. Unified Family Survey యాప్ వస్తుంది.

సచివాలయానికి వెళ్లాలా?

సర్వేలో మార్పుల కోసం సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఏవైనా సమస్యలు ఉంటే లేదా యాప్ యాక్సెస్ ఇబ్బంది అయితే అలాంటి వారు.. సచివాలయ సిబ్బందిని కలిసి సమస్యను చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి: MINOCA Heart Attack: మినోకా హార్ట్ ఎటాక్ అంటే ఏంటి, ఎందుకొస్తుంది? రాకుండా ఏం చెయ్యాలి? నిపుణుల మాట

ఏపీ ప్రభుత్వం ఈ సర్వేని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సర్వే పూర్తైన తర్వాత.. దీని ఆధారంగానే పథకాల్ని రూపొందిస్తుంది. అలాగే.. ఈ డేటా ఆధారంగానే పరిపాలనా సంబంధిత నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే పథకాలకు అర్హులా, కాదా అనేది నిర్ణయించడానికి కూడా ఈ డేటాను లెక్కలోకి తీసుకుంటుంది. ఇలా ఈ కుటుంబ సర్వే డేటా కీలకమైనది. కాబట్టి.. సర్వేలో పాల్గొనేవారు తమ డేటాలో ఎలాంటి లోపాలూ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *