AP Politics: ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు.. రాష్ట్రంలో రేపటి నుండి కొత్త మార్పు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చివరి రోజు కౌన్సిల్ సమావేశం తో పాటు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్ పర్సన్ స్థానాల్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారులు రానున్నారు.

+

ఏపీ

ఏపీ చైర్ పర్సన్ లు దిగారు..ప్రత్యేక అధికారులు ఎక్కారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చివరి రోజు కౌన్సిల్ సమావేశం తో పాటు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్ పర్సన్ స్థానాల్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారులు రానున్నారు. వారి పాలన కమిషనర్ తో కలిపి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఐదు సంవత్సరాల పదవీకాలంలో కొన్నిచోట్ల వైసిపి చైర్ పర్సన్లు దాదాపు చోట్ల కూటమికి సంబంధించిన చైర్పర్సన్లు మున్సిపాలిటీలో పని చేశారు. నేటితో దాదాపు మున్సిపాలిటీలో చైర్పర్సన్స్ , కౌన్సిల్ కాలం పూర్తయింది. ఒకసారి ఏపీలో ఆ కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అధికారులు చేయవలసిన బాధ్యతలేంటి ఒకసారి క్లుప్తంగా చూద్దాం.

ఇకపై నో చైర్ పర్సన్స్..

పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీ ప్రధానమైనది. మౌలిక వసతులు కల్పించడంతోపాటు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర ఎప్పుడు మున్సిపాలిటీదిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తరఫున అధికారిగా ప్రతి మున్సిపాలిటీలో  కమిషనర్ పనిచేస్తూ ఉంటారు. అయితే ప్రజల తరపు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధిగా చైర్ పర్సన్, వార్డుకు ఒక కౌన్సిలర్ పనిచేస్తూ ఉంటారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెజార్టీ కౌన్సిలర్ల తీర్మానంతో అప్పటివరకు చైర్ పర్సన్ గా ఉన్నవారు కౌన్సిలర్ గా మారడం, అప్పటివరకు కౌన్సిలర్ గా ఉన్నవారు చైర్ పర్సన్ గా మారడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏదేమైనా సుదీర్ఘకాలంగా కూటమికి సంబంధించిన కౌన్సిలర్లు చైర్ పర్సన్లు ప్రజా ప్రతినిధులుగా పని చేశారు.

వీడ్కోలు..

అయితే మంగళవారంతో ఈ గడువు ముగియడంతో అత్యవసర సమావేశం నిర్వహించి కౌన్సిల్ సంబంధించి కొన్ని తీర్మానాల సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదించారు.తదుపరి వీడ్కోలు కార్యక్రమం సైతం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లాకు సంబంధించి తుని పెద్దాపురం సామర్లకోట కాకినాడ రూరల్ వంటి ప్రాంతాలలో ఉన్న మున్సిపాలిటీలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయని చెప్పుకోవచ్చు.

అధికారుల ముందున్న సవాళ్లు..

ప్రత్యేక అధికారిపై ప్రధాన సమస్యలు బుధవారం నుంచి బాధ్యతలు తీసుకుంటారు. ఈ ప్రత్యేక అధికారికి అన్ని మున్సిపాలిటీలో ప్రధానమైన సమస్యలు ఆహ్వానం పలుకుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ కొన్ని మున్సిపాలిటీలో చాలా సమస్యగా మారుతుంది. దీంతో అటువంటి సమస్యపై దృష్టి పెట్టాల్సి ఉంది. అంతకుమించి వేసవికాలం ప్రారంభం అయిన నేపథ్యంలో చాలా చోట్ల తాగునీటి సమస్యలు లేకుండా కమిషనర్ తో పాటు ఈ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా మున్సిపాలిటీ కట్టాల్సిన బకాయిలు వసూలు చేయడం, అంతకుమించి ప్రజలకు ప్రశాంతమైన పరిపాలన అందించడం ఈ ఇద్దరు అధికారులపై బుధవారం నుంచి నుంచి ఉంటుందని చెప్పుకోవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *