AP News Updates: స్వయంగా జనగణన చేసుకునే ఛాన్స్.. ఇలా చేస్తే చాలు! | తెలంగాణ వార్తలు


కేంద్ర ప్రభుత్వం జనగణనకు రెడీ అవుతోంది. మే ఒకటి నుంచి ఇది ప్రారంభమవుతుంది. తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో ఇది జరగబోతోంది. అందుకని టెక్నాలజీని బాగా వాడబోతున్నారు. పాత పద్ధతిలో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి జనగణన చేసేవారు. ఈసారి కుటుంబ సభ్యులే తమ వివరాల్ని స్వయంగా ఎంటర్ చెయ్యవచ్చు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 15 రోజులపాటు ఇలా చేసుకునే వీలు ఉంది. https://test.census.gov.in/seలోకి వెళ్లి.. మొబైల్ నంబర్ ఇచ్చి.. ఈ ప్రక్రియ నిర్వహించుకొనే అవకాశం ఉంటుంది. మే ఒకటిన ఇంటింటికీ వెళ్లి నిర్వహించే జనాభా లెక్కల సేకరణ సమయంలో ఇంటికి వచ్చే ఉద్యోగి.. అన్ని వివరాలూ నమోదయ్యాయో లేదో చూస్తారు. ఏవైనా నమోదు కాకపోతే, అప్పుడు పూర్తి చేస్తారు. దీని వల్ల సిబ్బంది టైమ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది.

ఇవాళ ఏమున్నాయి?

ఇరాన్ యుద్ధానికి 29 రోజులు పూర్తి అయ్యాయి. అంటే నెల పూర్తైనట్లు. ఇంకా యుద్ధం కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని మోదీ మన్ కీ బాత్ 132వ ఎపిసోడ్ రానుంది. నేడు ఓ హోటల్‌లో తమిళనాడు, పుదుచ్చేరి అభ్యర్థుల్ని టీవీకే అధినేత విజయ్ ప్రకటిస్తారు. నేడు కామదా ఏకాదశి. మహా విష్ణువుకి పూజలు చేస్తారు. IPLలో నేడు ముంబై, కోల్‌కతా మ్యాచ్. రాత్రి 7.30కి ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *