AP News Updates: విద్యావ్యవస్థపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పేరెంట్స్ అలర్ట్.! |


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026-27 అకడమిక్ సంవత్సరం నుంచి.. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు AI-ఆధారిత విద్యా విధానాన్ని (AI ట్యూటర్) మొదటిసారిగా ప్రవేశపెట్టబోతోంది. దేశంలో ఇలా చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీనే. ఈ కొత్త విధానం విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) బోధనను అందిస్తుంది. AI సాంకేతికత ద్వారా ప్రతి విద్యార్థికీ.. స్థాయికి తగిన కంటెంట్, ఆసక్తి ఆధారంగా పాఠాలు అందుతాయి. ఇలా బోధనా నాణ్యత పెరిగి, విద్యార్థులు వేగంగా నేర్చుకుంటారు. ఈ మార్పు విద్యా వ్యవస్థను ఆధునికీకరిస్తూ, భవిష్యత్ తరాలను ఏఐ ఆధారితంగా సిద్ధం చేస్తుంది.

ఇవాళ ఏమున్నాయి?

శ్రీవిష్ణు, నయన సారిక విష్ణు విన్యాసం సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందుకు ఇవాళ దానం నాగేందర్ రావాల్సి ఉంది. మంత్రి నారా లోకేష్ ఇవాళ ముంబైకి వెళ్తున్నారు.. హయత్ రీజెన్సీలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. నేడు ఆయేషా మీరా శరీర అవశేషాల అప్పగింత ఉంది. తెనాలిలో భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. నేడు.. రాజస్థాన్.. జైసల్మేర్‌లో యుద్ధ హెలికాప్టర్‌ ప్రచండ్‌లో ప్రయాణించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గద్వాల న్యూటౌన్‌.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా ఉంది. కడప జిల్లా.. కమలాపురంలోని యోగి వేమన యూనివర్సిటీ వేదికగా జాబ్‌మేళా ఉంది. T20 ప్రపంచ కప్‌లో నేడు ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ రాత్రి 7కి ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *