AP News Updates: చిన్నారి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య? |


మదనపల్లి జిల్లాలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని మృతదేహం.. కురబలకోట మండలం.. కనసానివారి పల్లె చెరువులో నిందితుడి మృతదేహం లభ్యమైంది. ముదివేడు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించనున్నట్లు తెలుస్తోంది. నిందితుడు.. 7ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, అత్యంత ఘోరంగా నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అతని మృతదేహం లభ్యం కావడంతో.. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక పోలీసులే చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా ఆనే అనుమానాలు కలుగుతున్నాయి.

సౌదీ అరేబియాలో నెలవంక కనిపించడంతో నేటి నుంచి రంజాన్ అని భావిస్తున్నారు. కొంతమంది రేపటి నుంచి అంటున్నారు. నేటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి 11 రోజులు ఉంటాయి. ఈ నెల 28 వరకూ కొనసాగుతాయి. నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ వెళ్తున్నారు. హైకమాండ్‌తో చర్చలుంటాయి. విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూమిలాన్ నేడు, రేపు జరుగుతుంది. ప్రపంచ యుద్ధనౌకలు, సబ్ మెరైన్ల ప్రదర్శన ఉంటుంది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. నేడు దానం నాగేందర్‌ని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నిస్తారు. అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెడుతూ.. నేడు బెంగాల్‌కి అమిత్ షా వెళ్తున్నారు. తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్స్ ఇవాళ విడుదల అవుతాయి. టీ20 వరల్డ్ కప్‍లో నేడు భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్ రాత్రి 7గంటలకు ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *