ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేవారికి విధించే వడ్డీని 50 శాతం మాఫీ చేస్తోంది. ఈ గడువు మార్చి 31తో ముగియగా.. ఇంకా చాలా మంది బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచుతూ జీవో జారీ చేసింది. అందువల్ల ఏప్రిల్ 30లోపు బకాయిలు చెల్లించే వారిపై పడే వడ్డీలో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం ఉపయోగించుకోవాలనీ, మళ్లీ గడువు పెంపు ఉండదని ప్రభుత్వం తెలిపింది.
ఇవాళ ఏమున్నాయి?
ఇరాన్ యుద్ధానికి 33 రోజులు పూర్తి అయ్యాయి. నేడు 34వ రోజు కొనసాగుతోంది. ఇవాళ హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విజయయాత్ర ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. వైన్ షాపులు బంద్ ఉన్నాయి. నేడు రాజ్యసభకు ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు వస్తుంది. మంత్రి నారా లోకేష్ నేడు ప్రధానిని కలిసి ధన్యవాదాలు చెబుతారు. నేడు తెలంగాణలో 12,760 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు జరుగుతాయి. IPLలో నేడు కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ రా.7.30కి ఉంది. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కింద ఉన్నాయి చూడండి.


