Last Updated:
CM Chandrababu: భారత్ శరవేగంగా అభివృద్ధి దిశగా, సాంకేతికత వైపు ముందుకు దూసుకెళ్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు రైసినా డైలాగ్(Raisina Dialogue)లో పాల్గొన్న సందర్భంగా ఆయన భారతదేశం టెక్నాలజీ రంగంలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. మూడు దశాబ్దాల క్రితం భారతదేశం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం దేశ అభివృద్ధికి బలమైన పునాది వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు.
CM Chandrababu: భారత్ శరవేగంగా అభివృద్ధి దిశగా, సాంకేతికత వైపు ముందుకు దూసుకెళ్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు రైసినా డైలాగ్(Raisina Dialogue)లో పాల్గొన్న సందర్భంగా ఆయన భారతదేశం టెక్నాలజీ రంగంలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. మూడు దశాబ్దాల క్రితం భారతదేశం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం దేశ అభివృద్ధికి బలమైన పునాది వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది ఐటీ నిపుణులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు. నాలెడ్జ్ ఎకానమీలో భారత్ ఇప్పుడు ప్రముఖ భాగస్వామిగా ఎదిగిందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లలో (GCCs) సుమారు 60 శాతం భారత్‌లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది భారతదేశం సాంకేతిక మరియు సేవల రంగంలో ఎంత కీలకమైన కేంద్రంగా మారిందో చూపిస్తుందని అన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కూడా భారత్ ముందంజలో ఉందని చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా యూపీఐ పేమెంట్ వ్యవస్థ డిజిటల్ లావాదేవీలలో కీలక మార్పు తీసుకువచ్చిందని వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా కోట్లాది మంది ప్రజలు సులభంగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు.
అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌పై విశ్వాసం ఉంచుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖపట్టణంలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. అదే సమయంలో అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో అమరావతిని క్వాంటం వ్యాలీ గా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నామని, త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాల తయారీ కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.
మూడు దశాబ్దాల క్రితం ఐటీ విప్లవాన్ని ప్రోత్సహించినప్పుడు అనేక విమర్శలు వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి ప్రధాన కేంద్రంగా మారిందని చెప్పారు. భవిష్యత్తులో ఏఐ ప్రపంచాన్ని మార్చే గేమ్ ఛేంజర్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలను ఎలా వినియోగించుకుంటామన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుందని చంద్రబాబు అన్నారు. సైబరాబాద్‌తో పాటు అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా నిర్మించి కాలుష్య రహిత ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేంద్ర-రాష్ట్రాల సహకారంతో సంస్కరణలు అమలు చేసి ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని ప్రభుత్వం కట్టుబడిగా ఉందని పేర్కొన్నారు.
భారత్ ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో వేగంగా ముందుకు సాగుతోందని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో భారతదేశం ఇతర దేశాలకు కూడా విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. శుద్ధ శక్తి ఉత్పత్తి మరియు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. విదేశాలకు చదువుకోడానికి వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే అధికంగా ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తెలుగు విద్యార్థులు ముందంజలో ఉన్నారని ఆయన అన్నారు.
ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ మంది ఉంటే అనేక ప్రోత్సాహకాలు:
ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతుండగా, దక్షిణ భారతదేశంలో జననాల రేటు తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు. దక్షిణాదిలో సంతానోత్పత్తి రేటు సుమారు 1.5 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల క్రితం కుటుంబ నియంత్రణపై ఎక్కువగా అవగాహన కల్పించామని గుర్తు చేసిన చంద్రబాబు, ఇప్పుడు జనాభా సమతుల్యత కోసం కుటుంబాల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇద్దరికి మించి పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించే సామర్థ్యం భారతదేశానికే ఎక్కువగా ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Mar 07, 2026 10:38 PM IST



