AP News: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ అదరహో.. ఏకంగా 5 జాతీయ అవార్డులు గెలిచిందోచ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:

AP Latest News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ శాఖకు మొత్తం ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో చూపిన ఉత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.

AP News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ శాఖకు మొత్తం ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో చూపిన ఉత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ మరియు జల్ సంచయ్ జన్ భాగీదారి వంటి కీలక విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించింది. అదనంగా మరో విభాగంలో ద్వితీయ స్థానం, ఇంకొన్ని రెండు విభాగాల్లో తృతీయ స్థానాలు దక్కించుకుని మొత్తం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, ప్రణాళికాబద్ధ అభివృద్ధిని అమలు చేయడంలో రాష్ట్రం విశేష పురోగతి సాధించింది. ముఖ్యంగా, గతంలో ఇదే విభాగంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు మొదటి స్థానానికి ఎదగడం గమనార్హం.

జిల్లాల వారీగా పలు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక గుర్తింపు: 

జిల్లాల వారీగా కూడా పలు గ్రామ పంచాయతీలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాలెం గ్రామం మహిళలకు అనుకూల వాతావరణం కల్పించడంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించింది. అలాగే విశాఖపట్నం జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ సుశాసనంలో అగ్రస్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదలలో వైఎస్ఆర్ కడప జిల్లా చెమ్ముళ్లపల్లి గ్రామం రెండో స్థానం దక్కించుకుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ మూడో స్థానంలో నిలిచింది.

కుప్పం మరోసారి అద్భుత ఘనత: 

ఇక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం మండలం దేశవ్యాప్తంగా మూడవ ఉత్తమ మండలంగా ఎంపిక కావడం మరో విశేషం. అదేవిధంగా తక్కువ ఖర్చుతో వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహించే జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమంలో కూడా రాష్ట్రం అగ్రస్థానాన్ని సాధించింది. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో పల్లె పండుగ 1.0, పల్లె పండుగ 2.0 వంటి కార్యక్రమాలను ప్రారంభించి గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేశారు.

రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహణ: 

రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించడం జరిగింది. గ్రామసభల్లో వచ్చిన వినతుల ఆధారంగా పల్లె వెలుగు కార్యక్రమం ద్వారా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల ఫలితంగా గ్రామీణ పాలనలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుని, జాతీయ స్థాయిలో ఈ పురస్కారాలు లభించడం విశేషంగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *