Last Updated:
CM Chandrababu: సమర్ధ పాలనకు అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం. రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం. వేసవి దృష్ట్యా ఆర్టీసీ బస్టేషన్లలో తాగునీటిపై శ్రద్ధ పెట్టండి. ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్షెప్షన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
CM Chandrababu: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్‌పై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వివిధ అంశాలపై చర్చించారు. డ్రోన్, సీసీ టీవీ కెమెరాలు, శాటిలైట్ సమాచారాన్ని సమీకృతం చేసి వినియోగించుకునేలా ఒక మెకానిజం తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు, పనితీరు మెరుగు పరుచుకునేందుకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై తమిళనాడులోని శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్ స్టేషన్లలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. బస్ స్టేషన్‌కు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా జరిగేలా పరిస్థితులు ఉండాలన్నారు. అటు పెన్షన్ల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అట్టడుగు స్థానంలో ఉన్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
అలాగే ప్రభుత్వం దగ్గరున్న సమాచారం కాకుండా అదనపు సమాచారం కోసం మాత్రమే ఇకపై సర్వేలు జరపాలని ముఖ్యమంత్రి తెలిపారు. అంతేగానీ పదేపదే ఒకేరకమైన సమాచారం కోసం ప్రజలను, ప్రభుత్వ సిబ్బందిని ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మరోవైపు రాష్ట్రంలో వాట్సప్ మనమిత్ర సేవలను మరింత విస్తృతం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాట్సప్ సేవల సంఖ్యను 953కి పెంచినట్లు తెలిపారు. అయితే వీటన్నింటినీ సులభంగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
దీపం పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగున్నా.. ఆర్టీసీ బస్ స్టేషన్‌లో సౌకర్యాలు, ఔట్ సోర్సింగ్ సర్వీసులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పుంగనూరు, వెంకటగిరి, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి బస్ స్టేషన్‌లో తాగునీరు, టాయిలెట్లు, ఫ్యాన్స్, సీటింగ్ ఏరియాపై ప్రయాణికుల నుంచి అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం రాష్ట్రంలోని అ్ని బస్టేషన్‌లో టాయిలెట్స్ మరమ్మతులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



