AP News: ఎన్టీఆర్ ఆసుపత్రిలో స్పీకర్ అయన్నపాత్రుడు ఆకస్మిత తనిఖీలు.. కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం.. అసలేం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

​AP News: నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఆకస్మిక తనిఖీ. నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరిక. కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం, విజిలెన్స్ విచారణకు ఆదేశం

ap news
ap news

​AP News: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం(ఇవాళ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి మరమ్మతులు, రంగులు వేసే పనుల కోసం నాబార్డ్ కింద సుమారు రూ.40 లక్షల నిధులను స్పీకర్ మంజూరు చేయించారు. ఈ నిధులతో జరుగుతున్న పనులను స్థానిక కౌన్సిలర్ చింతకాయల పద్మావతితో కలిసి ఆయన పర్యవేక్షించారు. అయితే, పనుల్లో నాణ్యత లోపించడాన్ని గమనించిన స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణను గట్టిగా నిలదీశారు. తక్షణమే ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు.

పనుల్లో ఎటువంటి అవకతవకలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణను బ్లాక్ లిస్టులో పెట్టాలని సంబంధిత అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యవేక్షణలో సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *