AP DEECET 2026: ఏపీ డీఈఈ సెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. లాస్ట్ డేట్ అప్పుడే.. వెంటనే అప్లై చేసుకోండి.. | జాబ్స్ & ఎడ్యుకేషన్


Last Updated:

ఏపీ డీఈఈ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, డి ఎల్ ఎడ్ కోర్సు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు, ఫీజు 1000 రూపాయలు, ఇంటర్ 50 శాతం అర్హత

ఏపీడీఈఈ సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం పూర్తి వివరాలు ఇవే..!!!
ఏపీడీఈఈ సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం పూర్తి వివరాలు ఇవే..!!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని ఆశించే అభ్యర్థులకు ఒక సువర్ణావకాశం లభించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఎలిమెంటరీ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ డీఈఈ సెట్ (AP DEECET) – 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కార్వేట్ నగరం డైట్ (DIET) ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ లోకల్ 18 ద్వారా పలు కీలక వివరాలను వెల్లడించారు.

ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకునే విద్యార్థులు ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తమ కలను నిజం చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.

ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాలు: దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు కింది కాలపట్టికను గమనించాల్సి ఉంటుంది. దరఖాస్తులు మార్చి 31, 2026 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 15, 2026 దరఖాస్తుకు చివరి తేదీ. అభ్యర్థులు రూ. 1000 పరీక్షా రుసుముగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని మార్చి 31 నుండి ఏప్రిల్ 15 మధ్య ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కోర్సులో ప్రవేశం పొందాలంటే అభ్యర్థులు కింది విద్యార్హతలు, వయోపరిమితిని కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు మార్కులలో సడలింపు ఉంటుంది. వీరు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 సెప్టెంబర్ నాటికి అభ్యర్థికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. అయితే, గరిష్ట వయోపరిమితిపై ఎలాంటి ఆంక్షలు లేవు.

డీఈఈ సెట్ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్ – ఎ: 60 మార్కులు. పార్ట్ – బి: 40 మార్కులు. ప్రశ్నపత్రం అభ్యర్థుల సౌలభ్యం మేరకు తెలుగు, ఉర్దూ, తమిళం, ఇంగ్లీష్ మాధ్యమాల్లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థి దరఖాస్తు సమయంలో ఎంచుకున్న మాధ్యమం ఆధారంగా పరీక్ష రాయవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లైన https://cse.ap.gov.in లేదా https://apdeecet.apcfss.in సందర్శించాలి. ముందుగా వెబ్‌సైట్ నుండి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకుని నిబంధనలను పూర్తిగా చదువుకోవాలి. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే జర్నల్ నంబర్ ఆధారంగా దరఖాస్తును పూర్తి చేయాలి. అభ్యర్థి ఫొటో సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు నేరుగా అధికారిక వెబ్‌సైట్లను చూడవచ్చు లేదా హెల్ప్ లైన్ నంబర్ 7995869743 నుQ సంప్రదించవచ్చని డాక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి నిమిషం రద్దీని తట్టుకోవడానికి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్‌షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *