AP Assembly: 20 కోట్ల తిరుమల లడ్డూలు కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం. ఇలాంటి తప్పు మరో మతంలో జరిగితే గగ్గోలు పెట్టేవారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఇలా చేయడం దారుణం. ఆ భగవంతుడి డబ్బుతో ఆడుకున్న వారి తలలు లేచిపోతాయి.

AP Assembly Heated Debate Over 20 Crore Tirumala Laddoo Controversy CM Chandrababu Naidu deputy cm pawan Kaylan Comments on Tirumala Laddoo Adulteration
AP Assembly Heated Debate Over 20 Crore Tirumala Laddoo Controversy CM Chandrababu Naidu deputy cm pawan Kaylan Comments on Tirumala Laddoo Adulteration

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రధాన చర్చా అంశంగా నిలిచింది. సీఎం చంద్రబాబు నాయుడు సభలో ప్రసంగిస్తూ, 2019 నుండి టీటీడీలో జరిగిన నెయ్యి సరఫరా,  లడ్డూ తయారీ వ్యవస్థల లోపాలను వివరించారు. సమావేశంలో పవర్ పాయింట్ స్లైడ్స్ ద్వారా లడ్డూ కల్తీ, నెయ్యి నాణ్యత సమస్యలపై వివరణ ఇచ్చారు.

చంద్రబాబు మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి దైవంపై జరిగిన అన్యాయం పట్ల మేం ఆవేదనతో ఉన్నామని, టీటీడీ వ్యవస్థలో నిబంధనలు బదిలీ చేయక, నెయ్యి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కల్తీ జరిగిందని తెలిపారు. 20.01 కోట్ల విలువల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారై విక్రయించారని, దీనికి రూ.234 కోట్లు ఖర్చు చెల్లించారన్నారు. గత టీటీడీ బోర్డు నిబంధనలను సరైనగా పాటించక, టెండర్లు మేకింగ్‌లో లోపాలు చేసిందని చెప్పారు.

సీబీఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు, రిపోర్టులు, నెయ్యి శాంపిల్స్ పరిశీలనల ద్వారా కల్తీ జరిగిందని తేలింది.  2022లో కూడా ఈ విషయంపై వచ్చిన నివేదికలను అప్పటి అధికారులు పట్టించుకోలేదని సీఎం తెలిపారు.

ఈ చర్చలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ హయాంలో దేవాలయాలపై దాడులు జరిగాయి. అడిగితే కేసులు పెట్టారని అన్నారు. మా కులదైవం వేంకటేశ్వర స్వామి. ఆయన నన్ను ప్రమాదం నుంచి కాపాడారని గుర్తు చేశారు. నేను సీఎం కాగానే మెుదట టీటీడీ ప్రక్షాళన చేశానని తెలిపారు. బ్రిటిషు వాళ్లు కూడా వెంకటేశ్వరుల స్వామి జోలికి వెళ్లలేదు. కానీ గత పాలకులు క్షమించరాని పాపం చేశారు. దైవ క్షేత్రంలో ఈ మహాపాపం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ చర్చలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వివరాలను తెలియజేశాడు. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదం కల్తీ అయ్యిందని పవన్ తెలిపారు. నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారని నివేదికలు స్పష్టంగా తెలిపాయని అన్నారు. కల్తీ జరిగిందని వైసీపీ ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదు. కానీ కల్తీ జరగలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోంది. అందుకే మేం వివరణ ఇవ్వాల్సి వస్తుంది. లడ్డూ కల్తీపై దీక్ష చేశాను. వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు చేసినా మేం వారిపై ఆరోపణలు చేయలేదని పవన్ గుర్తు చేశాడు.

నచ్చిన సంస్థలకు టెండర్లు కట్టబెట్టారు.

అన్ని ఆధారాలు ఉన్నా వైసీపీ ఇలా ఎందుకు చేస్తుంది. వివరణ జరిపి దోషులపై చర్యలు తీసుకోమని జగన్ చెబితే సరిపోయేది. కానీ ఇలాంటి నాటకాల వల్ల పెద్ద తప్పు జరుగుతుంది. గత ప్రభుత్వం తప్పు చేసిందని మేం అనలేదు. తప్పు అప్పటి టీటీడీ బోర్డు చేసింది. ఆ టీటీడీ బోర్డును జగన్ ఎందుకు వెనక వేసుకుని వస్తున్నారు అర్థం కాలేదు. నచ్చిన సంస్థకు టెండర్లు అప్పగించాలని రూల్స్ అన్ని బ్రేక్ చేశారు. ఈ అంశంలో దోషులకు శిక్ష పడాల్సిందే అన్నారు డిప్యూటీ సీఎం పవన్.

అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం. ఇలాంటి తప్పు మరో మతంలో జరిగితే గగ్గోలు పెట్టేవారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఇలా చేయడం దారుణం. ఆ భగవంతుడి డబ్బుతో ఆడుకున్న వారి తలలు లేచిపోతాయి.

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *