ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో 7వ తరగతి అర్హతను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణంగా SSC పాస్ కావడం ముఖ్యంగా పేర్కొన్నారు. అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ పరిధిలోని గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానికురాలు అయి ఉండాలి. వివాహిత మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. వయస్సు కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
మడకశిర, గుడిబండ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులు వివిధ గ్రామాలు, తండాలు, వార్డుల వారీగా కేటాయించారు. వాటిలో హెచ్ డీహళ్ళి (ఎస్టీ), మడకశిర 17వ వార్డు (బీసీ-ఈ), దొమ్మర హట్టి (బీసీ-ఏ), చందకచర్ల-2 (ఎస్సీ), సింగేపల్లి (ఓసీ), బీరాయపురం (బీసీ-బీ), అక్కంపల్లి (ఓసీ), ఉప్పిడిపల్లి (ఓసీ), సీకోడిగపల్లి (ఎస్సీ), ఎన్ ఎస్ గొల్లహట్టి (ఓసీ), కల్లుమర్రి-3 (బీసీ-ఏ), జీ గొల్లహట్టి (ఓసీ), భగవంతుని గుడి (ఓహెచ్), కాకి గొల్లహట్టి (ఓసీ), చందకచర్ల తండా (ఎస్టీ), అయ్యవారిపల్లి (ఓసీ), బీజీ గొల్లహట్టి (బీసీ-బీ), ఆవినకుంట (ఓసీ), గౌడనహళ్ళి (ఎస్సీ), సంకంపాళ్యం (ఓసీ), బంద్రేపల్లి (బీసీ-డీ), మడకశిర చాకలికుంట (ఓసీ), కొరగార్ల గుట్ట (ఎస్సీ), కాడ్ల గొల్లహట్టి (ఓసీ), డీ గొల్లహట్టి (బీసీ-డీ), రొళ్ళమారుతి నగర్ (బీసీ-ఈ), జాడ్రహళ్ళి (బీసీ-ఏ), కేఎం గొల్లహట్టి (ఓసీ),
ఇక ఎం గొల్లహట్టి (ఓసీ), దేవరహట్టి (బీసీ-బీ), ఈ అచ్చంపల్లి తండా (ఎస్టీ), వెంకటంపల్లి (ఓసీ), రత్నగిరి (ఎస్సీ), కొత్త గొల్లహట్టి (ఓసీ), జీఎన్ పాళ్యం (బీసీ-ఏ), హొట్టెబెట్ట (ఓసీ), బాజయ్యపాళ్యం (బీసీ-బీ), ఉజ్జనీ పురం (ఓసీ), బల్లేకట్ట (ఎస్టీ), కెంకర-2 (ఓసీ), కేకే పాళ్యం-2 (బీసీ-బీ), నాచేపల్లి-2 (ఓసీ), చిగతుర్పి-2 (ఓసీ), దాసరపల్లి-2 (ఓసీ), కెంపగానహట్టి (బీసీ-సీ), శివరం (ఓసీ), ముతుకూరు-2 (ఎస్సీ), కరేకల్లహట్టి (ఓసీ), రామయ్యనపాళ్యం (బీసీ-డీ), గుణేహళ్ళి-2 (బీసీ-బీ), శంకరగల్లు-3 (బీసీ-ఏ), బాగల్-3 (ఓసీ), కొంకల్లు-2 (ఎస్సీ), ఎం వడ్రహట్టి (ఓసీ), కల్లురొప్పం-2 (బీసీ-బీ) వంటి ప్రాంతాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికగా ఉంటుంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తదుపరి కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అదనంగా సీడీపీఓ నిర్వహించే తెలుగు డిక్టేషన్ రాయగలగడం కూడా అవసరం. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు పుట్టిన తేదీ ధ్రువీకరణ (SSC మెమో), విద్యార్హత సర్టిఫికేట్లు, కుల ధ్రువీకరణ పత్రం, స్థానికతకు సంబంధించిన రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడీ వంటి పత్రాలు సమర్పించాలి. దివ్యాంగులకు సంబంధించి సదరం (SADAREM) సర్టిఫికేట్ తప్పనిసరి.
గ్రామస్థాయిలోనే ఉద్యోగం పొందే ఈ అవకాశం మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా బలాన్ని ఇస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. తక్కువ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే అరుదైన అవకాశం కావడంతో, అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.


