విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. వర్సిటీ సమస్యలపై అధికారులతో చర్చించేందుకు ఎస్ఎఫ్ఐ (SFI), ఏఐఎస్ఎఫ్ (AISF) ప్రతినిధులు సెనెట్ హాల్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ఏబీవీపీ (ABVP) విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వర్సిటీలో విద్యార్థుల మధ్య మతాల చిచ్చు పెడుతున్నారంటూ ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా, పోటాపోటీ నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. ప్రస్తుతం పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ అధికారులతో విద్యార్థి సంఘాల చర్చలు కొనసాగుతున్నాయి.
Source link
Andhra University Tension: ఏయూలో RSS రచ్చ.. అక్కడ హైటెన్షన్


