Last Updated:
Amaravati Capital: అమరావతి చట్టబద్దత బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో తిరుపతిలో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి.
Tirupati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని అందుకు చట్టబద్ధత కల్పించాలని ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం చేయడంతో ఏపీలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ని స్వర్ణాంధ్రగా మార్చేందుకు కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం సాధించిన విజయంతో అన్నీ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి చట్టబద్దత బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో తిరుపతిలో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి.
నగరంలోని పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఊరేగింపులు చేపట్టారు. జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. “దేవతల రాజధాని అమరావతి” అంటూ గళమెత్తారు. ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు టీడీపీ శ్రేణులు. ఈ సందర్భంగా టీడీపీ కోడూరు నాయకుడు ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంద్రుని వేషధారణలో తిరుపతిలోని స్థానికులకు మిఠాయిలు పంచుతూ సందడి చేశారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులు కూడా ఇంద్రుని వేషాల్లో ప్రజల్లోకి వెళ్లి మిఠాయిలు పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది.
ఈ వినూత్న కార్యక్రమం చూసిన ప్రజలు ఆసక్తిగా వీక్షిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ ఆ నాడు అమరావతిని నిర్మించింది ఇంద్రుడే అన్నట్లు భావించాం.. ఈ నాడు అమరావతిని నిర్మించేది చంద్రబాబే అని వ్యాఖ్యానించారు. అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమని తెలిపారు. ఈ నిర్ణయం పట్ల తమ ఆనందాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నామని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. మరోవైపు కేవలం కోస్తాంధ్రలోనే కాదు ఉత్తరాంధ్రలో కూడా సంబరాలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రానికి ఏకైక రాజధాని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న అమరావతే అందరి రాజధాని అంటూ స్వీట్లు పెంచుకొని , బాణాసంచా పేల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh


