Amaravati Capital: ఏపీ రాజధానిని రాష్ట్రం, కేంద్రం నిర్ణయించలేదు.. మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది ముమ్మాటికి ఆ భగవంతుడు నిర్ణయించారు.

+

Amaravati

Amaravati Capital

Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది ముమ్మాటికి ఆ భగవంతుడు నిర్ణయించారు. అందుకే అమరావతి రాజధాని చట్టబద్దత బిల్లు ఆమోదిస్తూ ప్రకటించిన సమయం 11.11 అంటూ ఒక టీడీపీ మహిళ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అసలు 11.11సమయం అంటే ఏంటో తెలుసా..? మీరు గూగుల్ లేదా ఆధ్యాత్మికవేత్తలను అడగండి తెలుస్తుంది.ఎంతో శుభ పరిణామం సాక్షాత్తు దేవతలు దైవతామూర్తులు ఆశీస్సులు ఉంటే తప్ప అలాంటి సమయం రాదు. ఇది ముమ్మాటికీ దైవ నిర్ణయం అందులో తిరుగులేదు అంటూ ఆమె మాట్లాడారు. ఇంతకీ అలా మాట్లాడిన మహిళ ఎమ్మెల్యే ఎవరు? ఇంతకీ 11.11దేనికి సాంకేతకం ఒకసారి క్లుప్తంగా చూద్దాం.

ప్రజారాజధాని అమరావతి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని డిక్లేర్ చేస్తూ పెద్దల సభ ఆమోదం తెలిపారు. దీంతో ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11 కాబట్టి వైసీపీకి కౌంటర్ ఇచ్చినట్లుగా రాజ్యసభలో ఈ బిల్లు ఏప్రిల్ 2న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఆమోదముద్ర పడింది.

11 నంబర్‌తో వైసీపీకి కౌంటర్..

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె ప్రస్తుతం తుని ఎమ్మెల్యే అయిన యనమల దివ్య రాష్ట్ర రాజధాని అమరావతి పై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రం, కేంద్రం నిర్ణయించడం కాదు ఏపీ రాజధానిగా అమరావతిని దైవ నిర్ణయించింది అంటూ ఆమె మీడియా ముఖంగా పేర్కొన్నారు. లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించిన సమయం 11.11నిమిషాలు అంటే ఎంతో శుభసూచకం ముఖ్యంగా దేవతలు దైవతామూర్తులు కార్యక్రమాలకు  నిర్ణయించే ముహూర్తం ఇది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలచిన రాష్ట్ర రాజధానిని భగవంతుడు పూర్తిగా ఆమోదం తెలిపారు అనడానికి నిదర్శనం ఇదే అంటూ పేర్కొన్నారు. ఇక శాశ్వతంగా ఏపీకి రాజధాని అమరావతి అంటూ ఆమె స్పష్టం చేశారు.

సంబరాల్లో కూటమి నేతలు..

అన్ని నియోజకవర్గకేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో సైతం కోటమికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు నేతలు ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం అమరావతి ప్రకటించడం పట్ల హర్షతీ రేకాల వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల దీప కాంతులతో ర్యాలీ చేయగా మరికొన్ని చోట్ల ప్రజలతో కలిసి ప్రత్యేక ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర రాజధాని అమరావతి దేశం గర్వించే విధంగా వెజినరీ నాయకుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ముందుకు వెళుతుందంటూ వారు స్పష్టం చేశారు, గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ రాజమండ్రి కోనసీమ అమలాపురం పిఠాపురం తుని వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున ర్యాలీలు కొనసాగుతున్నాయి.

జగన్‌ని వీడని 11 నంబర్ ఎఫెక్ట్..

అయితే కొన్ని సోషల్ మీడియా వేదికల్లో మాత్రం వైసీపీకి 11 నంబర్ కలిసి రాలేదని.. అందుకే ఆపార్టీ గత ఎన్నికల్లో 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అదే విధంగా ఈసారి అమరావతి బిల్లు కూడా 11.11 గంటలకు ఆమోదం పొందడంతో పాటు ఈబిల్లు ప్రవేశపెట్టిన సమయంలో 11 పార్టీలు పాల్గొనడం మరో విశేషంగా చూస్తున్నారు. అంతే కాదు అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించాలని అన్నీ పార్టీలు చివరకు కాంగ్రెస్ సైతం మద్దతిస్తే కేవలం వైసీపీ మాత్రం వాకౌట్ చేసి ఒంటరి అయిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. సెటైరికల్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *