Last Updated:
Amaravati Capital: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి తాజాగా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతే కాదు ఆమె చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం కొసమెరుపు.
Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై అమరావతే. ఇది ఎవరూ ఎప్పటికి మార్చడానికి వీల్లేకుండా కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా అమరావతి చట్టబద్దత బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు ఉండేలా నిర్మిస్తామని వాగ్ధానం చేసిన చంద్రబాబును నమ్మి గత టీడీపీ హయంలోనే రాజధాని ప్రాంత రైతులు స్వచ్చందంగా ముందుకొచ్చి సుమారు 34వేల ఎకరాల భూముల్ని ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు టర్మ్ అయిపోవడం, అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రజారాజధాని కాస్తా మూడు రాజధానులుగా మారిపోయింది. దీంతో అమరావతి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారిపోయింది. భూములిచ్చిన రైతులు, రాజధాని వస్తే పరిశ్రమలు వస్తాయని నమ్మిన పెట్టుబడి పెట్టిన వాళ్లు గత ఐధేళ్లుగా వైసీపీ పాలనలో తీవ్రనష్టాలను భరించారు. రాజధాని వికేంద్రీకరణతో అమరావతి ఇక రాజధానిగా మారదనే అపోహతో ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామ్యంతో ఏపీలో అధికారం దక్కించుకున్నారు. అయితే జరిగిన పరిణామాలు, మారుతున్న రాజకీయాలు ఎలా ఉన్నా ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క రాజధాని అయినా ఉండాలన్నది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష. అందులో అమరావతి పేరుతో ఇప్పటికే భూసేకరణ చేపట్టి నిర్మాణాలు మొదలుపెట్టిన ప్రాంతం అయితే అభివృద్ది త్వరగా జరుగుతుందనే భావనలో ఉండగానే కూమిటి ప్రభుత్వం ఈ అమరావతి రాజధాని బిల్లుకు చట్టబద్దత కల్పించేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. అయితే ఈప్రయత్నాన్ని అందరూ పార్టీలకు అతీతంగా ప్రాంతాలను పక్కన పెట్టి మరీ స్వాగతించారు. సంబరాలు చేసుకుంటున్నారు.
కాని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి తాజాగా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతే కాదు ఆమె చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం కొసమెరుపు.
అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించడంతో ఇప్పుడు అంతా ఏపీ రాజధానిపైనే చర్చ జరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా వైసీపీ పాలకులు ఆంధ్రప్రదేశ్‌ని రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుకున్నారని కూటమి పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఒకే రాజధానిగా ఉంటే భవిష్యత్తులో తమిళనాడు, తెలంగాణతో విడిపోయినట్లుగానే తెలుగు వాళ్లు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్తరాంధ్ర ఉద్యమం, సీమాంధ్ర ఉద్యమం తెరపైకి వచ్చే ప్రమాదం ఉందని రాజధాని వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదన చేపట్టామని వైసీపీ సమర్ధించుకుంది. ఇదంతా గతించిన చరిత్ర అయినప్పటికి ఇప్పుడు అమరావతినే శాశ్వత రాజధానిగా ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు. అటు వైసీపీ నేతలు కూడా దానికి మేం వ్యతిరేకం కాదని అంటున్నారు. అయితే తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి పెట్టరా పేరు అమరావతి పిలవరా పేరు కమ్మరావతి అని కామెంట్ చేయడం సోషల్ మీడియా వేదికల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇప్పటి వరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రమే కాదు అందరిది అని భావించిన వాళ్లకు కూడా రేణుకా చౌదరి కామెంట్స్ కొత్త సందేహాన్ని కలిగిస్తున్నాయి. కేవలం ఒక సామాజికవర్గానికే అమరావతి అనే భావన వచ్చే విధంగా ఉందని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు రేణుకాచౌదరి కూడా అదే సామాజికవర్గానికి చెందిన నాయకురాలు కావడంతో అంటే అమరావతి ప్రాంతంలో అభివృద్ది, నిర్మాణంలో కేవలం కమ్మ వారికే ప్రాధాన్యత ఇస్తారా అనే సందేహాలను సోషల్ మీడియా వేదిక వ్యక్త పరుస్తున్నారు.
అయితే రాజకీయాలు వేరు.. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు సంబంధించిన అంశం కావడంతో దీనపై మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగానే కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్రప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూనే అదే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి తన సూచన అంటూ పోస్ట్ పెట్టారు. మీరు కట్టేది అమరావతే తప్ప కమరావతి కాకుండా చూచుకోండి తస్మాత్ జాగ్రత్త అంటూ ఇన్‌డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు.
పెట్టారా పేరు అమరావతి..
పిలవరా పేరు కమ్మరావతి….
ఇన్ని రోజులు నుంచి నాకు కూడా ఈ ఐడియా రాలేదు 😂– కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి. pic.twitter.com/tUqVshws2q
— 👻 (@vismayahh) April 2, 2026
ఏపీలోని అన్నీ ప్రాంతాలు ఒకటే అని ఇప్పటి వరకు భావిస్తున్న ఐదుకోట్ల మంది అమరావతి రాజధానిని శాశ్వత రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నారు. కాని ఇలాంటి సమయంలో రేణుకాచౌదరి ఒకే సామాజికవర్గానికి చెందినట్లుగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నారు.అయితే ఆమె మాటల్లో ఉద్దేశం వేరని.. చంద్రబాబు హయాంలోనే అమరావతి సాధ్యమైంది కాబట్టి పిలవరా కమ్మరావతి ఆయన్ని కీర్తించే విధంగా అని ఉంటుందని వత్తాసు పలుకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vijayawada,Krishna,Andhra Pradesh



