Adulterated Milk: అక్కడ టీ తాగుదామంటే భయం.. ఇలాగైతే ఛాయ్ దుకాణాలు బంద్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే ప్రజలు భయందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యం రద్దీగాఉండే అనేక టాప్ మోస్ట్ టీ సెంటర్‌లు సైతం కస్టమర్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి.

Rapid Read
+

Adulterated

Adulterated milk

Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే ప్రజలు భయందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యం రద్దీగాఉండే అనేక టాప్ మోస్ట్ టీ సెంటర్‌లు సైతం కస్టమర్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఇక రోడ్డు పక్కన ఉన్న టీ షాప్స్ అయితే మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ జిల్లాలో కల్తీ, కల్తీ,కల్తీ ఎక్కడ చూసినా కల్తీ మయం అనేది విపరీతంగా పాలు విషయంలో పబ్లిసిటీ అయిన నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆ కల్తీకి సంబంధించి ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు.మరి కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో పాలుకు సంబంధించిన, పాలు, నెయ్యి, బటర్ మిల్క్, పన్నీర్ వంటి వాటికి స్వస్తి చెప్పాలని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కష్టం పేరుతో ఆసుపత్రిలోకి చేరితే కనీసం పట్టించుకోలేదన్న ఆరోపణతో స్వయంగా ఆ జిల్లా పెద్ద ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సైతం ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం ఆ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక రోడ్డుపై ప్రజలు టీ తాగారా? ప్రజలు ఏమంటున్నారు ..? అధికారులు ఏం చెబుతున్నారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం

టీ తాగాలంటే వణికిపోతున్న జనం..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలో కల్తీ పాలు ఘటనకు సంబంధించి ప్రజల భయం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రతి ప్రాంతంలో కల్తీ జరుగుతుందని అయితే రాజమండ్రిలో జరిగిన కల్తీ కాస్త విషమించడంతోనే ప్రాణాలు పోయాయి అంటూ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్యాకెట్ బ్రాండ్ పాలు మినహా  లూజ్ పాలు లేదా కేంద్రం వద్ద పాలు అంతకుమించి రైతులు వద్ద ఉన్నపాలు కొనుగోలు చేయాలంటే భయందోళన చెందుతున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాపరించాయని చెప్పుకోవచ్చు.

కల్తీ భయం..

గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి ఉదయం సెంటర్‌కి వెళ్లి టీ తాగడం లేదంటే ఫ్రెండ్స్, బంధువులతో కలిసి కాఫీ సెంటర్ల దగ్గర కబుర్లు చెప్పుకోవడం ఒక ఆనవాయితీ. నిజానికి గోదావరి జిల్లాలో టీ బిజినెస్ ప్రతిరోజు లక్షల్లో ఉంటుందని సమాచారం. అయితే ప్రస్తుతం కల్తీపాలు నేపథ్యంలో టీ సెంటర్లు, చిన్న చిన్న టీ క్యాంటిన్ల దగ్గర టీ తాగేందుకు సైతం గోదావరిజిల్లాలో ప్రజలు భయపడిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే టీస్టాల్స్ కస్టమర్లు లేక పూర్తిగా వెలవెలబోతు కనిపిస్తున్నాయి. ఇరానీ చాయ్, సేట్ చాయ్, ఆర్యవైశ్య చాయ్ ఇలా ప్రస్తుతం పూర్తిగా అన్ని టీ ప్రత్యేక దుకాణాలు జనం లేని పరిస్థితి కనిపిస్తోంది. కేవలం కల్తీపాలు నివాసాలకే అందుతాయా?  ఇలాంటి దుకాణాలకు అందవా అన్న ప్రశ్న ప్రజల్లో రోజురోజుకు పెరిగిపోతుంది.

నిజమైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతుందా? 

ప్రమాదం సమస్య జరిగిన వెంటనే ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిస్తాం కానీ అక్కడ చులకన భావం, వైద్యం సరిగ్గా అందించకపోవడం, ముఖ్యంగా స్టాప్ నర్సుల దగ్గర నుంచి వైద్యుల వరకు పట్టించుకోలేదని వాదన పెద ఎత్తున వినిపిస్తుంది, తాజాగా రాజమండ్రి కల్తీపాలు అనారోగ్య ఘటనకు సంబంధించి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి పై అదే వాదన వినిపించింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇంత దారుణమా అన్నవిధంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం స్పందించి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి సూపర్టెండెంట్ ను ఇదే విషయంపై సస్పెండ్ చేశారు, మరో వైద్యుడిని సూపర్డెంట్ గా నియమించారు, ఏది ఏమైనా కష్టాల్లో వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న తరుణంలో సిబ్బంది వైద్యులు తీరు మార్చుకుని ఒక దేవుడు మాదిరిగా సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *