టాలీవుడ్ ‘బొమ్మరిల్లు’ ఫేమ్, సినీ నటి జెనీలియా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న జెనీలియాకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. జెనీలియాను చూసేందుకు భక్తులు, అభిమానులు ఎగబడ్డారు. శ్రీవారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, మనశ్శాంతి లభించిందని ఆమె మీడియాకు తెలిపారు.
Source link
Actress Genelia | తిరుమలలో జెనీలియా సందడి!


