విద్యార్థులకు చిక్కీలు అందకపోవడం దారుణం


నిర్లక్ష్య టెండర్‌ను వెంటనే రద్దు చేయాలి

పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర

ఏ ఐ ఎస్ యు జిల్లా అధ్యక్షులు కనుమ దామోదర్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చిక్కీలు సకాలంలో అందజేయాలని పి ఎస్ యు, ఎ ఐ ఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి పక్కాట్లు పట్టుకొని నిరసన తెలపడం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మంజుల నరేంద్ర, కనుము దామోదర మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై రోజు నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం కింద అందించాల్సిన చిక్కీలు ఇప్పటికీ సరఫరా కాకపోవడం విద్యార్థులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అని తెలిపారు. చిక్కీల సరఫరా బాధ్యత చేపట్టిన చండీఘర్ సీడ్స్ లిమిటెడ్ సంస్థ నిర్లక్ష్య వైఖరి ఖండించారు. ధర్మవరం పట్టణంలోని విద్యార్థులతో పాటు జిల్లా వ్యాప్తంగా 1,20,000 వేల మంది విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఈ సంస్థపై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత టెండర్‌ను రద్దు చేయాలి. విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారం అందించే బాధ్యతగల సంస్థలకు టెండర్ అప్పగించాలి అని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యుల పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేశారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

The post విద్యార్థులకు చిక్కీలు అందకపోవడం దారుణం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *