విశాలాంధ్ర-రాజాం(విజయనగరం జిల్లా): ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ రాజాం ప్రెస్ క్లబ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని పేర్కొంటూ, భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ తహశీల్దార్ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.


