- మహిళా బిల్లు ముసుగులు బిజెపి ప్రవేశపెట్టింది డి లిమిటేషన్ బిల్లు
- 2023లో పాస్ అయిన మహిళా బిల్లు 2034 నుండి అమల్లోకి వస్తుంది
- దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి
- ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి కొత్త డ్రామాకి తెర
- మహిళా వ్యతిరేకి బిజెపి
- డీ లిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం
- బిజెపికి మహిళలపై గౌరవం ఉంటే ఎన్నికల జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో 33% వంతున సీట్లు ఇవ్వాలి
- బిజెపి తరఫున తమిళనాడు ఎన్నికలలో చంద్రబాబు ప్రచారం చేయటానికి సిగ్గుపడాలి
- అమరావతిలో మూడో విడత భూ సేకరణకు సీపీఐ వ్యతిరేకం
- 30 సంవత్సరాల కాలంగా దొనకొండలో ఎందుకు పారిశ్రామిక అభివృద్ధి చేపట్టలేదు
– మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఫైర్
పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మహిళా బిల్లెనా అని, 2023 లో పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళ బిల్లును తిరిగి ఎలా ప్రవేశపెడతారని, కేవలం ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో ఓట్లు రాబట్టుకునేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఫైర్ అయ్యారు. ఏపీ ప్రజానాట్యమండలి కోస్తా జిల్లాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు ఒంగోలులో ప్రారంభమవుతున్న నేపథ్యంలో, వాటిల్లో పాల్గొనేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మంగళవారం ఒంగోలుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ మహిళా బిల్లు ముసుగులో డీ లిమిటేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందేందుకు బిజెపి కుట్ర చేసిందన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు సందేహాలపై, ఒక గంట వ్యవధిస్తే మార్పులు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోసపూరితంగానే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహిళా బిల్లు ముసుగులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. మహిళా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే అది తమ విజయం గా ప్రచారం చేసుకునేందుకు సన్నద్దమైందన్నారు. బిల్లు వీగిపోతే ఆ నెపాన్ని ఇండియా బ్లాక్ పై వేసి, ముసలి కన్నీరు కార్చేందుకు పక్కా పథకాన్ని రచించింది అన్నారు. పార్లమెంటులో ది లిమిటేషన్ బిల్లు వీగిపోవటంతో ఇప్పుడు ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలు దేశంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు బిజెపి నోరు మెదపలేదన్నారు. బిజెపి ఎంపీ ఒక మహిళా రెజ్లర్ అనుచితంగా ప్రవర్తించినప్పుడు బిజెపి నోరు ఎత్తలేదన్నారు. ఒక దళిత మహిళపై దారుణంగా అత్యాచారం జరిగినప్పుడు బిజెపి నోలెత్తలేదన్నారు. బిజెపి మూల గ్రంథమైన మను సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఎల్లప్పుడూ మహిళల పట్ల చిన్న చూపు చూస్తూనే ఉన్నారన్నారు. అటువంటి బిజెపి నేడు మహిళలంటే తమకు ఎంతో గౌరవం అన్నట్లు శుద్ధ పూస పలుకులు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా బిల్లు 2034 తర్వాత అమలులోకి వస్తుందని నారీ శక్తి వందన్ పేరుతో బిజెపి సంబరాలు చేసుకున్న విషయాన్ని బిజెపి నేతలు మరిచినా, దేశ ప్రజలు మరువలేదని గుర్తు చేశారు. డీ లిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభా పెట్టుకొని నాటి ప్రధానులు ఇందిరాగాంధీ, వాజ్ పాయి లు దాదాపు 50 సంవత్సరాలు పాటు జనగణన జరగనివ్వలేదన్నారు. ప్రధాన మంత్రుల మాటలు విని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఒకరు లేదా, ఇద్దరూ నినాదాన్ని అమలులోకి తీసుకొచ్చి జనాభా పెరగకుండా అదుపులోకి తీసుకువచ్చారన్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రానికి ప్రజలు దానిని అమలు చేయకుండా గణనీయంగా జనాభా ను పెంచుకున్నారు అన్నారు. డీలిమిటేషన్ అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల కన్నా, ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా ఎక్కువగా పోతుందన్నారు. అందువల్లే ఇండియా బ్లాక్ పార్టీలు ఈ బిల్లును అడ్డుకున్నాయన్నారు. బిజెపి మాటలను మూర్ఖంగా రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, వైసీపీలో అమలు చేసేందుకు సిద్ధమవటం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు బిజెపి పక్షాన తమిళనాడులో ప్రచారానికి వెళ్ళటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయింది అన్నారు. రేషన్, భూ మాఫియాలు అధికార పార్టీ నాయకుల చేతుల్లోనే ఉందన్నారు. చివరికి మెడికల్ కళాశాలలకు ఇచ్చిన భూములను కూడా అధికార పార్టీ నాయకులు వదలటం లేదన్నారు. రాష్ట్రంలో భూములను వ్యవసాయ భూములుగా కాకుండా, వ్యాపార వస్తువుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులను, వ్యవసాయాన్ని నిండా ముంచారన్నారు. అమరావతిలో మూడో విడత భూ సేకరణకు సిపిఐ వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా శూన్యమన్నారు. 30 సంవత్సరాలుగా దొనకొండ పారిశ్రామిక కారిడార్ లో అధికార పార్టీలు చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, రైతులకు, ప్రజలకు అరిచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అంటే వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడమే అన్నారు. అయితే రాష్ట్రంలో ఇవి రెండూ అభివృద్ధి జరగటం లేదన్నారు. రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధరలు తగ్గటం లేదన్నారు. చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి అంటే పోలవరం, అమరావతి అభివృద్ధి అన్న తీరుగా పాలన సాగిస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు తగ్గించమని నిర్మాణం చేస్తూ, అమరావతి కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నగరంగా అభివృద్ధి చేస్తున్నారని ఈపాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను చేస్తున్న మోసాన్ని బయటపెడుతూ ఏపీ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో రానున్న కాలంలో ప్రచారాలు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగానే పోస్టల్ జిల్లాల ఏపీ ప్రజానాట్యమండలి కళాకారుల సమావేశం ఒంగోలులో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


