నీటి సంరక్షణతోనే సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధ్యం


ఎంపీడీవో విజయలక్ష్మి

విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం గంగలకుంట గ్రామంలో ‘జలధార, జలహారతి’ కార్యక్రమాన్ని నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రకు మార్గం” అనే నినాదంతో నిర్వహించారు. ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది కలిసి మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు. ప్రతి మొక్కను సంరక్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు అచ్యుతానంద బాబు, అశోక్ బాబు, ఏపీవో సావిత్రి, పంచాయతీ కార్యదర్శి శమంతకమణి, ఫీల్డ్ అసిస్టెంట్ తలారి శివ, సచివాలయ సిబ్బంది మరియు ఇతర స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *