ఒరాకిల్ డేటా సెంటర్‌పై దాడి చేశాం


ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి

తెహ్రాన్: ఇరాన్ తన ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. అమెరికాకి సాంకేతిక సహకారం అందిస్తోన్న టెక్ కంపెనీలపై దష్టి సారించింది. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇంత వరకు దాడులు చేసిన ఇరాన్ ఇప్ప్పుడు సాంకేతిక సంస్థలపై గురిపెట్టింది. ఈ క్రమంలో అమెరికా టెక్ సంస్థలే లక్ష్యంగా గురువారం దుబాయ్‌లోని ఒరాకిల్, బహ్రెయిన్‌లోని అమెజాన్ సంస్థల డేటా సెంటర్లపై ఐఆర్‌జీసీ దాడులు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే ఈ వార్తలను యూఏఈ అధికారులు ఖండించారు. ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఐఆర్‌జీసీ దాడులు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ తప్ప్పుడు ప్రచారాలని కొట్టిపడేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయాల్లో తప్ప్పుడు వార్తలు వ్యాప్తి చేయవద్దని అధికారులు మీడియా సంస్థలను కోరారు. మరోవైపు యూఏఈ, బహ్రెయిన్‌లోని తమ డేటా సెంటర్లపై ఇరాన్ దాడిని అమెజాన్ ధ్రువీకరించింది. దీంతో తమ కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. గల్ఫ్ దేశాల్లో తమ దాడుల లక్ష్యాలను గుర్తించడంలో అమెరికన్ ఏఐ కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని. అందుకే ఇకపై ఆ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇటీవల ఐఆర్‌జీసీ హెచ్చరించింది. తమ దాడుల జాబితాలో యాపిల్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబీఎం, డెల్, టెస్లా, బోయింగ్, హెచ్‌పీ, జేపీ మోర్గాన్ తదితర పేర్లు ఉన్నట్లు తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *