విశాలాంధ్ర – పెద్దకడబూరు : కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని టీడీపీ బీసీ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, మండల ప్రధానకార్యదర్శి మొట్రు రామాంజనేయులు, బూత్ యూనిట్ ఇంచార్జీ తలారి అంజి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక లక్ష్మిపేటలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందు ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాకేష్ రెడ్డి, ఆర్మీ ఈరన్న, మహేష్, యువరాజు, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.


