36వ ఆర్యవైశ్య సామూహిక వివాహ మహోత్సవ వేడుకలు..


అధ్యక్షులు జయంతి వినోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తేరు బజారులో గల వాసవి కళ్యాణ మండపం (కొత్త సత్రం) లో ఫిబ్రవరి 21 శనివారం, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, ఫిబ్రవరి 22 ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ఉపనయనం, అనంతరం 10 గంటల నుండి 11 లోపు వివాహ మహోత్సవ వేడుకలతో పాటు విందు భోజనం కూడా ఉంటుందని తెలిపారు. రెండు రోజులపాటు 36వ ఆర్యవైశ్య సామూహిక వివాహ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు జయంతి వినోద్ కుమార్, కార్యదర్శి తాళంకి ప్రభాకర్ గుప్తా, కోశాధికారి మాగలూరు గంగాధర్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వివాహ శుభకార్యాలకు తాళిబొట్టు, గిన్నేబొట్టు, కాశీ యాత్ర కొంతమంది దాతలు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. సామూహిక వివాహములను ప్రోత్సహించండి, ఒకరి వివాహము ఒకరి ప్రతిష్ట అయితే, సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని అది సమాజానికే ప్రతిష్ట అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెనుజూరి సూర్యనారాయణ, బిమిశెట్టి కృష్ణమూర్తి, సహకార దర్శి గాదంశెట్టి నాగభూషణ, రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *