28వ తేదీనే పెన్షన్ పంపిణీ – Visalaandhra


ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం; ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిధిలోని 6,722 మంది పెన్షన్ దారులకు 2 కోట్ల 96 లక్షల 79 వేల 500 రూపాయలను 14 సచివాలయాలలోని ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పెన్షన్ దారులు తమ ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తారని తెలిపారు. ఎవరికి కూడా ఎటువంటి లంచము ఇవ్వరాదని, అలా ఎవరైనా సచివాలయ ఉద్యోగులు అడిగితే మాకు వెంటనే సమాచారాన్ని అందించాలని తెలిపారు. కావున ఫిబ్రవరి 28వ తేదీన పెన్షనర్లు మా సచివాలయ ఉద్యోగుల ఉద్యోగస్తులకు సహకరించాలని తెలిపారు.

సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య.

ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షనర్లకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని 40 వార్డులలో 17,852 మంది పెన్షన్ దారులకు 7 కోట్ల 82 లక్షల 13వేల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పెన్షన్ దారులు తమ ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తారని తెలిపారు. ఎవరికి కూడా ఎటువంటి లంచము ఇవ్వరాదని, అలా ఎవరైనా సచివాలయ ఉద్యోగులు అడిగితే మాకు వెంటనే సమాచారాన్ని అందించాలని తెలిపారు. కావున ఫిబ్రవరి 28వ తేదీన పెన్షనర్లు మా సచివాలయ ఉద్యోగుల ఉద్యోగస్తులకు సహకరించాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *