22 ఏ ని తొలగించి షేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చేయించండి


-ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు

విశాలాంధ్ర- ధర్మవరం: రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, నెల కిందట ముదిగుబ్బలో ఇచ్చిన హామీ మేరకు 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించి అవి తక్షణమే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ నాయకులు మండల తహసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో 2018 నుంచి చాలా పాత పట్టా భూములు నిషేధిత జాబితాలో చేర్చబడి రిజిస్ట్రేషన్ కు నోచుకోకుండా పోయిన సందర్భంలో నెల కిందట ముదిగుబ్బలో 907, 908 సర్వే నెంబర్లలో ఉన్న 13.6o ఎకరాల్లోని ఇళ్ల స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ధర్మవరం ఆర్డీవో మహేష్ తదితరులు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ అనుమతి పత్రాలను అందజేయడం జరిగిందని, దీంతోపాటు 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న మిగతా భూములను కూడా దశల వారీగా త్వరలోనే ఆ జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ ఆర్భాటంగా హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు వారుహామీ లిచ్చి నెలరోజులవుతున్న నేటికీ ఒక్క సెంటును కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి స్థానిక అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు, 2018 నుంచి తమ భూములు, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ కాకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో నెల కిందట అధికారులు రెండు సర్వే నంబర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ కి అవకాశం ఇచ్చి , నిషేధిత జాబితా నుంచి మిగతా సర్వే నంబర్లను నేటికీ తొలగించకపోవడంతో మంత్రి హామీ ఇచ్చిన మేరకు త్వరలోనే తమ భూములు, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయని ఎంతో ఆశాభావంతో ఉన్న ప్రజలు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండల వ్యాప్తంగా22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎటువంటి రికార్డులు, వినతి పత్రాలతో సంబంధం లేకుండా తక్షణమే అవి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో బాధిత ప్రజలతో కలిసి త్వరలోనే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్య తో పాటు,స్థానిక నాయకులు కుర్రా నాయుడు, గంగులప్ప, గంగాధర, లింగుట్ల వెంకట రాముడు,
ఆ పార్టీ నల్లమాడ మండల కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *