సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు
2029 నాటికి ఇండియా కూటమి బలమైన శక్తిగా ఎదుగుతుంది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి లోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా సమితి సమావేశం కె రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బిజెపి లేని ప్రభుత్వం నిర్మించడం ఖాయం అన్నారు. నరేంద్ర మోడీ నియంతగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అన్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్ర ల ఎన్నికల్లో బీజేపీ బరి తెగించి కేరళ తమిళనాడు లో ప్రభుత్వాలను కులదిసేందుకు కుట్రలు చేస్తోంది అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో బిజెపికి పరాభవం తప్పదు అన్నారు. కేరళ లో వామపక్ష ప్రభుత్వం, తమిళనాడులో తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు. గ్రామీణ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల్లో రాజకీయ చైతన్యం పెంపొందించాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ట్రంప్ యుద్ధంమానంతో ఇరాక్ పై చేస్తున్న యుద్ధంతో భారతదేశం పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గ్యాస్ దొరకకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా శాంతికాముకులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలి అన్నారు. ఒక దేశద్యక్షుడిని ఎత్తుకెళ్లినా మోడీ ఖండించకపోవడం అన్నారు. మోడీ ప్రభుత్వం విదేశాంగ విధానం దారుణంగా మారింది అన్నారు. ఉన్న వారికి విద్య, వైద్యం, ఉపాధి ఇవ్వలేని చంద్ర బాబు ఎక్కువ మందిని పిల్లల ను కనమని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. నేటికి ఇల్లు లేని పేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అన్నారు. ఇళ్ల స్థలాల కోసం ఈ నెల 24 వ తేదీ లబ్ధిదారులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు పాల్గొన్నారు.


