16 యుద్ధ విమానాలు కోల్పోయిన యూఎస్


వాషింగ్టన్: ఇరాన్ తో యుద్ధం ఆరంభం అయినప్పటి నుంచి అమెరికాకు చెందిన 16 యుద్ధ విమానాలు కుప్పకూలాయి. వీటిల్లో 10 MQ-9 ను రీపర్ డ్రోన్ లను శత్రు దళాలు కూల్చాయి. మరికొన్ని యుద్ధంలో కూలిపోయాయి. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది. కువైట్ లో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్ లో అమెరికాకు చెందిన మూడు ఎఫ్ – 15 యుద్ధ విమానాలు నాశనమయ్యాయి. ఇరాక్ లో అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ – 135 కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియా లో కూడా ఓ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షపని దాడుల్లో ఐదు కేసీ -135 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలు మానవ రహిత రీపర్ డ్రోన్ లను మాత్రమే కూల్చివేసాయి. వీటిల్లో దాదాపు 9 గాల్లోనే ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు. జోర్డాన్ లోని ఒక విమానాశ్రయంలో నేలపై ఉన్న డ్రోన్ ను బాలిస్టిక్ క్షిపణి ఢీ కొట్టింది. మరో రెండు డ్రోన్ లు వేరు వేరు ప్రమాదాల్లో ధ్వంసం అయ్యాయి. ఈ రీపర్ డ్రోన్ లు ధర చాలా తక్కువగా ఉంటుంది. పైలట్లు అవసరం లేకుండా నడుస్తాయి. అందుచేతనే వీటిని కీలకమైన ప్రదేశాల్లోనే ఎక్కువగా మోహరిస్తారు. యుద్ధం నేపథ్యంలో ఇరుపక్షాలకు యుద్ధ విమానాలు, ఆయుధ సామాగ్రి మాత్రమే కాకుండా ఎంతో మంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పంతాలు వీడి శాంతిని పునరుద్ధరించాలని ఆయా దేశాలను మేధావులు, సామాన్య ప్రజానీకం కోరుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *