14న జిల్లా జూనియర్ మహిళల హాకీ జట్టు ఎంపికలు


హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బి సూర్యప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానము నందు మార్చి 14వ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా జూనియర్ మహిళల హాకీ జట్టు ఎంపికలను నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, హాకీ శ్రీ సత్యసాయి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో పాల్గొనుబోవు జూనియర్ క్రీడాకారులు 01.01.2007 తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు. దీంతోపాటు క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల హాకీ క్రీడాకారులు ఉపయోగించుకోవాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *