ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల విషయంలో కూడా విస్తృత అవకాశాలు కల్పించారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, అలాగే ఏఎన్ఎం, జీఎన్ఎం, నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.



