హోర్ముజ్ జల సంధి పై గందరగోళం


తెహ్రాన్ : ఇరాన్- అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనితో తాత్కాలికంగా యుద్ధం ముగిసినట్లు కనిపించింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. అమెరికా ఒప్పందం షరతులకు లోబడి హోర్మోజ్ ను తెరిచిన తెహ్రాన్… లెబనాన్ లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ‘ సముద్ర భద్రత సూత్రాలకు అనుగుణంగా సీమైన్స్ నుంచి రక్షణ కోసం హోర్మోజ్ జల సంధి మీదుగా ప్రయాణించే నౌకలు ప్రత్యమ్నాయ మార్గాలను తీసుకోవాలి ‘ అని ఐ ఆర్ జి సి ప్రకటించినట్లు తెలుస్తోంది.
దీనితో హార్మోస్ జలసంధి పై గందరగోళం నెలకొంది. కొన్ని గంటల కిందట మూసివేతపై ప్రకటన రాగా… మళ్లీ ఇప్పుడు ఆ దేశం ప్రత్యమ్నాయ మార్గాలు సూచించింది అంటూ వార్తలు రావడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *