విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని, మొట్టమొదటి పీజీ స్టూడెంట్ డాక్టర్ మృదుల కు బీకాన్-2026 నేషనల్ కాన్ఫరెన్స్ లో జాతీయస్థాయిలో జరిగిన క్విజ్ పోటీలో ప్రథమ బహుమతి సాధించడం మెడికల్ కళాశాలకు గర్వకారణమని ఇంచార్జీ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ శంకర్ తెలిపారు. ఇంకా ప్రవేశం పొంది వారం రోజులే అయినా, నేషనల్ కన్ఫరెన్స్లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ శ్రీనివాస్ శౌరి పర్యవేక్షణలో శిక్షణ పొంది హైదరాబాదులోని నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్ లో ఈ నెల 14,15 తేదీలలో జరిగిన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ కాన్ఫరెన్స్ బీకాన్-2026 సదస్సులో క్విజ్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించడం చాలా స్ఫూర్తిదాయకమని ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఛాంబర్ లో పి .జీ డాక్టర్ మృదుల ను శాలువా,జ్ఞాపిక తో సత్కరించారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ ఓ డి ఆచార్య డాక్టర్ శ్రీనివాస్ శౌరి మాట్లాడుతూ… క్లినికల్ ఆపరేషన్స్ అండ్ నెట్వర్కింగ్ లో బిల్డింగ్ ఎక్స్లెన్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పైన జరిగిన సదస్సులో డాక్టర్ మృదుల పాల్గొనడం, మంచి జ్ఞానంతో క్విజ్ లో ప్రథమ బహుమతి జాతీయస్థాయిలో పొందడం మా డిపార్ట్మెంట్ కు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య కుమార్, డాక్టర్ నారాయణస్వామి, నాన్ మెడికల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ కోకిల చాముండేశ్వరి, డిఇఓ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


