సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్


సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆరు నెలల క్రితం ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు. లేహ్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అయితే లడాఖ్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో ప్రాంతంలోని అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు జరపాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఉద్దేశంతోనే సోనమ్ వాంగ్‌చుక్‌పై విధించిన నిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

హైపవర్ కమిటీ ద్వారా చర్చలు జరిపి చర్యలు
ఇక 2025 సెప్టెంబర్‌ 24న లడాఖ్‌లోని లేహ్‌ ప్రాంతంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి.
దీంతో అక్కడ శాంతి భద్రతల పరిస్థితి క్షీణించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 2025 సెప్టెంబర్‌ 26న ఎన్ఎస్ఏ చట్టం కింద సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు. లేహ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లడాఖ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. బంద్‌లు, నిరసనల కారణంగా ప్రాంతంలో సాధారణ జీవనం దెబ్బతింటోందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు హైపవర్ కమిటీ ద్వారా చర్చలు జరిపి చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

The post సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *