సైనిక నియామక ప్రకటన: అగ్నివీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.

భారత సైన్యంలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సెట్విజ్ సీఈఓ వి. విశ్వేశ్వరరావు తెలియజేశారు.

సైన్యంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది ఒక చక్కటి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు www.joinindianarmy.nic.in అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్యంలో చేరాలనుకునే వారు వెంటనే తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలు సైన్య అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *