సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు చుక్కెదురు


విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: సుప్రీంకోర్టులో వాన్‌పిక్ ప్రాజెక్టుకు చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన అభియోగాలను సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుందని, దానికి గల కారణాలు చెప్పలేదంటూ వాన్‌పిక్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో వాన్‌పిక్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై విచారణకు నిరాకరిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

The post సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు చుక్కెదురు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *