సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ


విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలో టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ అధ్యక్షులు సొంటెన్న, బూత్ ఇంచార్జి దుమ్మల శివ, నాయకులు రామలింగ, నరసయ్యలు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *