సీఐ అశోక్ కుమార్ సేవలకు కొండoపేట గ్రామస్తులు చిరు సత్కారం


విశాలాంధ్ర – రాజాం (విజయనగరం జిల్లా):రాష్ట్ర పండుగగా నిర్వహించిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ వార్షికోత్సవ జాతర విజయవంతంగా నిర్వహించడంలో విశేషంగా సేవలు అందించిన రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్‌ను కూటమి నాయకులు అభినందించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సీఐ అశోక్ కుమార్ సేవలు అందించినందుకు రాజాం కొండంపేట కూటమి నాయకులు ఆయనను దుస్సలువాతో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బలిమి ఉమా, క్లస్టర్,వార్డ్ ఇంచార్జ్ నాగిరెడ్డి సూరిబాబు, సలాది బుల్లి, బాదిరెడ్డి చిన్న, త్రిపురాన మణి, ఉప్పల సంతోష్, సుంకర శ్రీను గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *