–ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు పిలుపు
విశాలాంధ్ర- విజయనగరం టౌన్: కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4లేబర్ కోడ్లను అమలు జరిపి కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు కట్టిబానిసలుగా చేస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న జరగబోయే దేశ వ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ అధ్యక్షులు ఎస్ రంగరాజు పిలుపునిచ్చారు మంగళవారం ఏపీ స్వచ్ఛంధ్ర మోటార్ వెహికల్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ స్టేడియం వద్ద. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జె. కామేష్ అధ్యక్షతన సమ్మెకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న ప్రతిసారి కార్మికులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న తీరును కార్మికులంతా తిప్పి కొట్టాలన్నారు. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్ళలో అనేక కార్మిక చట్టాలను నీరుగార్చిందని, సులభతర వాణిజ్యం నెపంతో కార్మికులకు వ్యతిరేకంగా ఆదాని ,అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మికులు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు సైతం మార్పుల చర్యలకు పాల్పడుతుందన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం 26వేల రూపాయలు తక్షణమే అమలు చేయాలని. డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛ్ ఆంధ్ర క్లాప్ డ్రైవర్లను ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మిక స్కీం కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12 వ తేదీన జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
The post సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి appeared first on Visalaandhra.


