సర్వసభ్య సమావేశానికి పలువురు మండలాధికారులు గైర్హాజరు..


-అధికారులకు ప్రజాసమస్యలు పట్టవా
-ప్రశ్నించిన సర్పంచులు, ఎంపీటీసీలు

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ బి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన సాధారణ సర్వ సభ్యసమావేశానికి పలువురు మండలాధికారులు గైహాజరయ్యారు. ముఖ్యఅతిథిగా జడ్పిటిసి పసుపుల హేమావతి హాజరయ్యారు. మూణ్ణెల్ల క్రితం జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని, చేపట్టాల్సిన పథకాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి సభ్యులకు వివరించాల్సిన అధికారులు సమావేశానికి రాకపోవడంపై సర్పంచులు, ఎంపీటీసీలు ప్రశ్నించారు. సర్పంచులకు చివరి సాధారణ సమావేశం అయినందున పంచాయతీల్లో సమస్యలపై నెలకొన్న సమస్యలపై ఎవరిని అడగాలని ఎంపీడీఓ బి.విజయలక్ష్మిని అడిగారు. అదే విధంగా గ్రామాల్లో గ్రామసభలు జరిగితే సంబంధిత అధికారులు స్థానిక సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా సభలు పూర్తి చేసి సంతకాల కోసం రిజిస్టర్లను పంపించడం ఎంతవరకు సమంజసమన్నారు. సర్వసభ సమావేశానికి రెవెన్యూ, జల వనరులు, విద్యుత్ శాఖ, ఐసిడిఎస్, ఫారెస్ట్, ఏపీఎస్ఆర్టీసీ, సాంఘిక సంక్షేమ అధికారులు హాజరు కాకపోవడంపై అధికారులకు సమావేశాలు అంటే బాధ్యత లేదని చర్చించుకోవడం జరిగింది. సమావేశంలో పశు సంవర్ధక, వైద్యం, విద్య, వ్యవసాయం, వెలుగు, ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం అధికారులు తమ ప్రగతిని చే పట్టబోయే పనుల గురించి వివరించారు, కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

The post సర్వసభ్య సమావేశానికి పలువురు మండలాధికారులు గైర్హాజరు.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *