సమస్యలపై సమరమే – Visalaandhra


. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటాం
. స్పష్టమైన ప్రకటన చేయకపోతే అసెంబ్లీ ముట్టడి
. ఉపాధ్యాయుల నినాదాలతో దద్దరల్లిన ధర్నాచౌక్
. డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధతం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హెచ్చరిక

విశాలాంధ్ర-విజయవాడ:తమ సమస్యలపై సానుకూల ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా పాýకుల నుండి ఎటువంటి ప్రకటనలు రాకపోవడంపై మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలపై మౌనం వీడి… స్పష్టమైన ప్రకటన చెయ్యకపోతే చలో అసెంబ్లీ చేపట్టక తప్పదని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయు) చేపట్టిన దశల వారీ పోరాటంలో భాగంగా మూడవ దశ ఉద్యమ కార్యాచరణ సమర శంఖం సందర్భంగా విజయవాడలోని ధర్నా చౌక్‌లో వేలాదిమంది ఉపాధ్యాయులతో బుధవారం ధర్నా జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ అధికారం కోసం ఎన్నికల సమయంలో పెద్దఎత్తున హామీలు కురిపించి… అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దష్టి సారించకుండా కేవలం అవకాశవాద రాజకీయాలకు తెరలేపి గందరగోళం సష్టిస్తున్నారని ఆరోపించారు. పలు రూపాల్లో ప్రభుత్వ దష్టికి తీసుకువస్తున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ ధోరణి సరైనది కాదని హితవు పలికారు. ప్రభుత్వాలు ఏవైనా, పాలకులు ఎవరైనా ఉద్యమాలు పెద్దఎత్తున చేసినప్ప్పుడు మాత్రమే స్పందించి… డిమాండ్లు పరిష్కరిస్తారని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరిగే పోరాటాలకు, ఉద్యమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ఈశ్వరయ్య ప్రకటించారు.
సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎల్.సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, తరువాత విస్మరించి, ఉద్యోగులను ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేయడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, జి.సదానంద్ గౌడ్, సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఉద్యమాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక ప్రయోజనాలకు మంగళం పాడుతూ… ఆనవాయితీని తుంగలో తొక్కి, ఉద్యోగ, ఉపాధ్యాయులను పరాయివాళ్లుగా చూడడం తగదన్నారు. 12వ పీఆర్సీ గడువు దాటి మూడేళ్లు కావస్తున్నప్పటికీ… పీఆర్సీ కమిషన్ నియామకంలో కానీ, మధ్యంతర భృతి ప్రకటనలో కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ ధోరణి నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దుచేసి మెరుగైన ప్రత్యామ్నాయం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగులో ఉన్న సుమారు రూ.35 వేల కోట్ల బకాయిల విషయంలో అరకొర చెల్లింపులు చేస్తూ, మిగిలిన చెల్లింపులలో తీవ్ర నిర్లక్ష్యం వహించడం అన్యాయమన్నారు. ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా నాలుగు డీఏలు పెండింగులో ఉన్నా… కనీస స్పందన కరువైందన్నారు. పదవీ విరమణ
ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకుండా రెండు సంవత్సరాల నుండి పెండింగులో పెట్టడం తీవ్ర ఆక్షేపణీయమని మండిపడ్డారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 వర్తింపజేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం… ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి 12వ పీఆర్‌సీని, మధ్యంతర భృతిని, పెండింగ్ బకాయిలను, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డులు తదితర డిమాండ్ల పరిష్కారానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమణ, ఎస్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు కేవీ శేఖర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ఎస్‌టీయూ మాజీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి హెచ్.తిమ్మన్న, అనుబంధ విభాగాల అధ్యక్షుడు పి.మోహన్ రెడ్డి, కె.రత్నమాలినిదేవి, కె.లక్ష్మీనారాయణ, వెంకటరాజా, ఏఐఎసఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి.వెంగళరెడ్డి, ఇలియాస్ బాషా, డి.పెదబాబు, ఎస్.గోకారి, జి.ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శులు ఎన్.శివప్రసాద్, వెంకటరామిరెడ్డి, జి.సూర్యుడు, పి.పురుషోత్తం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 28 జిల్లాల నుండి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు వేలాదిగా తరలివచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *