సబ్ రిజిస్టర్ తాయన్న
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని సబ్ రిజిస్టార్ అధికారి తాయన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది ప్రజలు తమ పనుల నిమిత్తం వస్తారని, అటువంటి వారికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చుతుందని తెలిపారు. ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు పట్ల నిర్వాహకుల్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.
The post సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం appeared first on Visalaandhra.


